Tuesday, April 30, 2024

రోడ్ షో ఆలస్యం, నామినేషన్ వేయని కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

Arvind-Kejriwal

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ నామినేషన్ దాఖలు చేసే ప్రక్రియ మంగళవారానికి వాయిదా పడింది. సోమవారం నామినేషన్ వేయడానికి కేజ్రివాల్ భారీ ర్యాలీగా బయలు దేరారు. మామూలుగా అయితే మధ్యాహ్నం 3 గంటలకల్లా సంబంధిత కార్యాలయానికి చేరుకుని రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించాలి. అయితే రోడ్ షోలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ర్యాలీ త్వర త్వరగా ముందుకు సాగలేదు. దీంతో నామినేషన్ వేసేందుకు సమయం మించిపోయింది. దీంతో చేసేదేమీ లేక కేజ్రివాల్ నామినేషన్ దాఖలు ప్రక్రియను మంగళవారానికి వాయిదా వేసుకున్నారు. మంగళవారం నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కూడా.

‘ సోమవారం నేను నామినేషన్ వేయాలని అనుకున్నా. అయితే రోడ్‌షోలో పాల్గొన్న పార్టీ కార్యకర్తలు, ప్రజలను కాదని ఎలా వెళ్లగలను? మంగళవారం నామినేషన్ వేస్తా’ అని కేజ్రివాల్ విలేఖరులకు చెప్పారు. కేజ్రివాల్ తొలుత వాల్మీకి మందిరంలో భగవాన్ వాల్మీకి ఆశీస్సులు తీసుకొని రోడ్‌షోను ప్రారంభించారు. ఆమ్‌ఆద్మీపార్టీ ట్రేడ్‌మార్క్ టోపీ, చేతిలో ఆమ్ ఆద్మీ పార్టీ అయిదేళ్ల ప్రోగ్రెస్ కార్డు పట్టుకొని కేజ్రివాల్ భార్య సునీతా కేజ్రివాల్, కుమార్తె హర్షిత, కుమారుడు పులకిత్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తదితరులు రోడ్‌షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అంతకు ముందు కేజ్రివాల్ తన తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకొని నామినేషన్ వేసేందుకు బయలుదేరారు.

Delhi CM Arvind Kejriwal Fails To File Nomination

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News