Friday, July 4, 2025

ప్రజాగ్రహానికి తలవంచిన ఢిల్లీ సర్కార్

- Advertisement -
- Advertisement -

ప్రజల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతో ఢిల్లీ సర్కార్ వెనక్కితగ్గింది. పజాభిప్రాయానికి తలవంచింది. 15 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం నుంచి ఉన్న పెట్రోల్ వాహనాలు, పది సంవత్సరాలకన్నా ఎక్కువ వాడకంలో ఉన్న పాత డీజిల్ వాహనాలకు ఇంధనాన్ని నిరాకరించే వివాదాస్పద ఉత్తర్వులను ఢిల్లీ సర్కార్ నిలిపివేసింది. పలు సాంకేతిక సమస్యల వల్ల పాత వాహనాలకు ఇంధన నిషేధం కష్టసాధ్యమని డిల్లీ పర్యావరమ శాఖమంత్రి మంజిందర్ సింగ్ సిర్సా మీడియాకు తెలిపారు. తమ వాహనాలను ఎంతో ప్రేమతో చూసుకునే వ్యక్తులకు కష్టం కలిగించే బదులు, సరిగా నిర్వహించని వాహనాలను స్వాధీనం చేసుకునే ఓ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జీవితాంతం, లేదా ఎండ్ ఆప్ లైప్ విధానానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున ప్రజాగ్రహం పెల్లుబికింది.

దేశ రాజధానిలో పెరిగిపోతున్న వాహన కాలుష్యాన్ని అరికట్టే ఉద్దేశంతో జూలై 1 నుంచి కమిషన్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ మేనేజిమెంట్ ఆర్డర్. (సిఎక్యూఎం) అమలులోకి వచ్చింది.ఢిల్లీలో ముఖ్యంగా శీతాకాలంలో విపరీతమైన,విషపూరితమైన పొగమంచు వల్ల నానా ఇక్కట్లు పడుతున్నారు. అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. మిగతా సంవత్సరం అంతా కూడా నాణ్యత లేని గాలి వల్ల బాధపడుతున్నారు. ఢిల్లీలో అత్యధిక కాలుష్యాన్నివెదజల్లు తున్న వాహనాలు 62 లక్షలకు పైగా ఉన్నాయి. వాటిలో కార్లు, ద్విచక్రవాహనాలు, ట్రక్కులు, పాతకాలపు ఆటో మొబైల్స్ ఉన్నాయి. సిఎక్యూఎం అమలులోకి రావడంతో ఆ వాహనాలన్నింటి పై ప్రభావం పడింది. 50 శాతం కాలుషా్యానికి కారణం ఈ వాహనాలే అని డేటా చెబుతోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News