Tuesday, April 30, 2024

డెంగీ, మలేరియా

- Advertisement -
- Advertisement -
Dengue malaria cases rise in Telangana
ఏది ఏ జ్వరమో తెలుసుకునేందుకు ప్రయాస
 కలవరపెడుతున్న డెంగీ, మలేరియా కేసులు
ఒకవైపు కోవిడ్ భయం.. మరోవైపు విషజ్వరాలు
రాష్ట్రంలో ప్రబలుతున్న విషజ్వరాలు, కొవిడ్ భయంతో వణుకుతున్న ప్రజలను కలవరపెడుతున్న సీజనల్ వ్యాధులు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో విషజ్వరాలు ప్రజలను కలవరపెడుతున్నాయి. విషజ్వరాలతో ప్రభుత్వ ఆసుపత్రుల ముందు జనాలు క్యూ కడుతున్నారు. మలేరియా, డెంగీ కేసులు పెరుగుతున్నాయి. వీటికి ప్రధాన కారణం పారిశుద్ధ్య లోపమే. ఒకవైపు కొవిడ్ భయం.. మరోవైపు విషజ్వరాలు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏది సాధారణ జ్వరమే, ఏదీ కరోనాతో అర్థంకాక ఆందోళనకు గురవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,206కి పైగా డెంగ్యూ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అలాగే 500కి పైగా మలేరియా కేసులు నమోదయ్యాయి. రికార్డుల్లోకి రాని కేసుల సంఖ్య ఇంకా చాలా ఎక్కువగా ఉంటోంది. రాష్ట్రంలో డెంగ్యూ, మలేరియా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

వర్షాకాలం ప్రారంభం కావడంతో సీజనల్ వ్యాధులు అటాక్ చేస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలతో పాటు ఏజెన్సీ ప్రాంతాలలో అత్యధికంగా మలేరియా కేసులు నమోదవుతున్నాయి. డెంగ్యూ కేసుల్లో సగానికి పైగా జిహెచ్‌ఎంసిలోనే నమోదయ్యాయి. అన్ని జ్వరాలను ప్రజలు కోవిడ్ జ్వరాలుగా భావించి మందులు వాడొద్దన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. మలేరియా కంటే క్రమంగా డెంగీ కేసులే అధిక సంఖ్యలో నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. డెంగీ వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తే కొంతమంది మందిలోనే జ్వర లక్షణాలు కనిపిస్తుండగా, మరికొందరిలో తీవ్రమైన తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే చాలామంది వెంటనే కొవిడ్ పరీక్షలు చేయించుకుంటున్నారు. నెగెటివ్‌గా తేలితే సాధారణ జ్వరమే అనుకుని తేలిగ్గా తీసుకుంటున్నారు. అయితే అలా తేలిగ్గా తీసుకోవడానికి లేదని, వైద్యులను సంప్రదించి అవసరమైన రక్త పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. డెంగీ విషయంలో జాప్యం చేస్తే రక్తంలో ప్లేట్‌లెట్లు పడిపోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

సండే.. డ్రై డేగా పాటించేలా చర్యలు

నగర ప్రాంతాల్లో డెంగ్యూ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నగర ప్రాంతాల్లో దోమల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో ఆయిల్, బ్లీచింగ్, ఫాగింగ్ తదితర చర్యలు చేపడుతోంది. ఈ ఆదివారం నుంచి ప్రతి ఆదివారం 10 గంటలకు పది నిమిషాల’ కార్యక్రమం జిహెచ్‌ఎంసి చేపట్టనుంది. మంత్రి కెటిఆర్ పిలుపు మేరకు పది గంటలకు 10 నిమిషాలు కార్యక్రమం నిర్వహించనున్నారు. పది వారాల పాటు ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు క్లినింగ్ ప్రోగ్రాం చేపట్టాలని నగరవాసులకు పిలుపునిచ్చారు. దోమలు చేరకుండా తమ ఇళ్లతో పాటు ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకోవాలని సూచించారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని సూచిస్తున్నారు. నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉంటే దోమలు చేరే అవకాశముంటుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News