Tuesday, May 7, 2024

నెరవేరిన మహా జల’కల’

- Advertisement -
- Advertisement -
Mallanna Sagar Trial Run Success
మల్లన్నసాగర్ ట్రయల్న్ సక్సెస్
50టిఎంసిల సామర్థం గల అతిపెద్ద జలాశయం 15.70లక్షల
ఎకరాలకు సాగునీరు తొలిదశలో 10టిఎంసిల నీటినిలువ ఆదివారం
తెల్లవారుజామున 3.30గం॥కు ప్రారంభమైన కాళేశ్వరం ఎత్తిపోతలు
ట్రయల్న్ విజయవంతంపై మంత్రి హరీశ్‌రావు హర్షం తెలంగాణకు
అమృత జలాభిషేకం జరిగింది, సిఎం కెసిఆర్ స్వప్నం సాక్షాత్కారమైంది
గోదారి గంగమ్మ మల్లన్నసాగరాన్ని ముద్దాడింది వందలాది విమర్శలు,
కుట్రలు, కుహనా కేసులు వరద నీటిలో కొట్టుకుపోయాయి : హరీశ్‌రావు

మనతెలంగాణ/ హైదరాబాద్/ సిద్దిపేట: నీటిపారుదల రంగంలో ముఖ్యమంత్రి కెసిర్ కల సాకారమయింది. సాగునీటిపారుదల ప్రాజెక్టుల రీడిజైన్ల పేరుతో ఎంచుకున్న లక్ష్యాలు కార్యాచరణ దిశగా పరుగులు పెట్టి తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చివేశాయి. గలగల పారుతున్న గోదావరి జలాలను తెలంగాణ బీడుభూములకు మళ్లించి బంగారు పంటలు పండించాలన్న లక్షంతో చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం దశలవారీగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ వస్తోంది. ప్రధాన నదులపై కాకుండా రాష్ట్రంలో 50టిఎంసిల నీటినిలువ సామర్ధంతో అతిపెద్ద రిజర్వాయర్‌గా మల్లన్నసాగర్ రిజర్వాయర్ ఆవిష్కరించింది.

ఆదివారం తెల్లవారుజామును 3.30గంటలకు వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య మల్లన్న సాగర్ జలాశయంలోకి గోదావరి నదీజలాలను ఎత్తిపోసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. సిద్దిపేట జిల్లా తోగుంట మండలం తుక్కుపూర్ శివారులోని పంప్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన 8భారీ మోటార్లలో మూడు మోటార్లను ఆన్ చేసి కాళేశ్వరం కాల్వనుంచి గోదావరి జలాలను మల్లన్న సాగర్ రిజర్వాయర్‌లోకి ఎత్తిపొత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు . తొలిసారిగా రిజర్వాయర్‌లోకి నీటివిడుదల ట్రయల్ రన్ విజయవంతం కావటంతో ఆర్ధికశాఖ మంత్రి హరీష్‌రావు హర్షం వ్యక్తం చేశారు. మల్లన్న సాగర్ సిఎం కెసిఆర్ స్వప్న సాక్షాత్కారం అని, తెలంగాణ రాష్ట్రానికి అమృత జలాభిషేకం జరిగిందన్నారు. అనుమానాలు ,అపశకునాలు, ఆవరోధాలు తలవంచి తప్పుకున్నాయన్నారు. కట్రలు కుహనాకేసులు ,వందల విమర్శలు వరదనీటిలో కొట్టుకుపోయాయి..గోదారి గంగమ్మ మలన్న సాగారాన్ని ముద్దాడింది..కరువును శాశ్వతంగా సాగనంపింది..తెలంగాణ రైతాంగం ఆనందంతో మరిసింది..ప్రజలమీద విశ్వాసంతో ,పట్టుదలగా పనిచేస్తే కానిదేది లేదని తెలంగాణ ప్రభుత్వం ప్రపంచానికి చాటిచెప్పిందని మంత్రి హరీష్ రావు ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.

గోదావరి జలాలను మల్లన్నసాగర జలాశయంలో తొలిదశ కింద 10టిఎంసిలు నిలువ చేయనున్నారు.ప్రతి సీజన్‌లో నీటినిలువను క్రమేపి పెంచుకుంటు పోనున్నట్టు ఈఎన్సీ హరీరాం తెలిపారు.కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అత్యంత కీలకమైన ఈ భారీ రిజర్వాయర్‌ను 50టిఎంసిల నీటినిలువ సామర్ధంతో నిర్మించారు.కాళేశ్వరం నుంచి మేడిగడ్డ, ఎల్లంపల్లి ,మిడ్‌మానేరు ,అనంతగిరి ,రంగనాయక సాగర్ రిజర్వాయర్ల ద్వారా గోదావరి జలాలను నింపుకుంటూ కాళేశ్వరం కాలువ ద్వారా కొమరవెల్లి మల్లన్న సాగర్ జలాశయంలోకి నీటిని నింపు తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్బాగంగా రూ.7400 కోట్ల అంచనాతో చేపట్టిన మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణ పనులను ప్రభుత్వం శరవేగంగా పూర్తిచేస్తూవచ్చింది.

ఇప్పటికే రిజర్వాయర్ పనులు 90శాతంపైగా పూర్తయ్యాయి.ఈ ప్రాజెక్టుకోసం ప్రభుత్వం 17వేల ఎక రాల భూమిని సేకరించింది. సముద్ర మట్టానికి 555 మీటర్ల ఎత్తున ఈ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టి మూడేళ్లలోనే పూర్తిచేసింది. 22.60 కిలోమీటర్ల పొడవున, 58.5 మీటర్ల ఎత్తుతో పటిష్టమైన మట్టికట్టను నిర్మించింది. కట్ట నిర్మాణం కోసం 13.58కోట్ల మట్టి క్యూబిక్ మీటర్ల మట్టిపని,2.77లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రిట్ పనులకు గాను ఇప్పటికే 96శాతం పనులు పూర్తయ్యాయి. మల్లన్న సాగర్ రిజర్వాయర్ ద్వారా 15లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు.ఇందులో 8.33లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందించాలని లక్షం గా పెట్టుకున్నారు. మరో 7.37లక్షల ఎకరాల పాత ఆయ కట్టును స్థిరీకరించనున్నారు. రిజర్వాయర్‌కు నాలుగు వైపులా తూములు ఏర్పాటు చేశారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణంతో రాంపూర్ , ఏటిగడ్డ, కృష్ణాపూర్, బ్రాహ్మణ బంజేరుపల్లి, లక్ష్యాపూర్, వేముల ఘాట్, పల్లెప్రహాడ్, సింగారం, ఎర్రవెల్లి గ్రామాలు ముంపునకు గురికాగా, తద్వారా 4298 కుటుంబాలు ప్రభావితం అయ్యాయి. ప్రభుత్వం నిర్వాసిలులకు న్యాయమైన రీతిలో పరిహారం అందించి ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజిని అమలు చేయటంతో నిర్వాసితులు స్వచ్చందంగా ప్రభుత్వానికి సహకారం అందించారు. మల్లన్న సాగర్ జలాశయంలోకి నీటివిడుదలతో ఈ ప్రాంత రైతుల్లో ఆనందోత్సాలు వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News