Saturday, May 4, 2024

విమానాల్లో తల్లిదండ్రుల పక్కనే 12 ఏళ్ల లోపు పిల్లలకు సీటు

- Advertisement -
- Advertisement -

12 ఏళ్ల లోపు చిన్నారులకు అదే పిఎన్‌ఆర్ నంబర్‌పై ప్రయాణిస్తున్న వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకుల్లో ఒకరి పక్కన సీటు తప్పనిసరిగా కేటాయించాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ( డిజిసిఎ ) ఆదేశించింది. విమానాల్లో కొన్ని సార్లు చిన్నారులకు తల్లిదండ్రులతో కాకుండా వేరుగా సీటు కేటాయిస్తున్న ఉదంతాల నేపథ్యంలో డీజీసీఎ ఈ ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన రికార్డులను నిర్వహించాలని సూచించింది. ఈ మేరకు నిబంధనలు సవరిస్తూ సర్కులర్ జారీ చేసింది. విమాన సంస్థలకు కొన్ని వెసులుబాట్లు కూడా కల్పించింది.

జీరో బ్యాగేజీ, సీట్ల ప్రాధాన్యం, మీల్స్/స్నాక్స్, /డ్రింక్స్, సంగీత వాయిద్య పరికరాలు తీసుకెళ్లడానికి రుసుములు వసూలు చేసుకోవచ్చని పేర్కొంది. అయితే , ఇది ఐచ్ఛికంగా ఉండాలని, తప్పనిసరి చేయకూడదని ఆదేశాల్లో స్పష్టం చేసింది. సాధారణంగా విమానాల్లో వెబ్ చెక్‌ఇన్ ఆప్షన్ ఉంటుంది. ఆ సమయంలో వచ్చిన సీటును ప్రయాణికుడు ఎంచుకునే వెసులుబాటు ఉంది. ఒకవేళ ఏ సీటూ ఎంచుకోకపోతే వారికి ఆటో సీట్ అసైన్‌మెంట్ నిబంధన వర్తిస్తుందని గుర్తు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News