Friday, May 3, 2024

చంద్రుని వివరణాత్మక అట్లాస్ విడుదల చేసిన చైనా

- Advertisement -
- Advertisement -

చంద్రుని వివరణాత్మక మొట్టమొదటి అట్లాస్‌ను చైనా విడుదల చేసింది. చైనా భౌగోళిక స్వరూపం అంతా ఇందులో కనిపిస్తుంది. భవిష్యత్తులో చంద్రునిపై మరిన్ని పరిశోధనలకు వీలుగా పరిశోధన స్థావరాన్ని ఏర్పాటు చేయడానికి కావలసిన సరైన ప్రదేశాన్ని ఎంచుకోడానికి ఈ అట్లాస్ ఉపయోగపడుతుంది. చంద్రునిపై అపోలో ప్రయోగాలు జరిగిన నాటి నుంచి ఉపయోగిస్తున్న భౌగోళిక మ్యాప్‌లు అలాగే ఉంటున్నాయి. వీటిలో ఎలాంటి మార్పు లేదు.

ఈ నేపథ్యంలో ప్రపంచం లోనే మొట్టమొదటి సంపూర్ణ విశేష చంద్రుని వివరణాత్మక భౌగోళిక అట్లాస్‌లను ఆదివారం విడుదల చేసింది. ఇవి చైనీ , ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంటాయి. చంద్రుని పరిణామ క్రమాన్ని అధ్యయనం చేయడానికి చంద్రుని పరిశోధన కేంద్రం నెలకొల్పడానికి అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకోడానికి ఈ అట్లాస్‌లు ఉపయోగ పడతాయని సిఎఎస్ శాస్త్రవేత్త కుయాంగ్‌జియూయాన్ అభివర్ణించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News