Monday, April 29, 2024

ఆ రెండే నన్ను బాధ పెట్టాయి: దినేశ్ కార్తీక్

- Advertisement -
- Advertisement -

జైపూర్ : రాజస్థాన్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు జట్టు ఓటమి, తన కెరీర్ గురించి దినేశ్ కార్తీక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రాజస్థాన్‌పై ఓటమి అనంతరం కార్తీక్ యూట్యూబ్ షో కుట్టీ స్టోరీస్‌లో స్పిన్ లెజెండ్ రవిచంద్రన్ అశ్విన్‌తో మాట్లాడాడు. తన కెరీర్‌లో బాధపడాల్సిన సందర్భాలు రెండే ఉన్నాయని తెలిపాడు. ‘నా సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌లో బాధపడ్డ సందర్భాలు ఆ రెండే. ఒకటి ముంబై ఇండియన్స్ నన్ను అట్టిపెట్టుకోలేదు.

నా కెరీర్‌కు ఎంతో మేలు చేసిన ముంబై ఫ్రాంచైజీ అలా వదిలేస్తుందని ఊహించలేదు. ఇక రెండోది ఏంటంటే.. చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడాలని ఉంది. కానీ, ఇప్పటి వరకూ ఆ కల నెరవేరలేదు’ అని కార్తీక్ తన మనసులో మాట వెల్లడించాడు. ఇక బెంగళూరు అభిమానులు ఎంతో విధేయత గలవారని, వాళ్లు మేము ఒక కుటుంబం. ఆనందంలో, బాధలోనూ వాళ్లు ఎప్పుడూ వెన్నంటే ఉంటారు. ఏమీ జరిగినా సరే వాళ్లు సపోర్టు చేయడం మాత్రం ఆపేయరు. నేను బ్యాటింగ్‌కు వెళ్తుంటే వాళ్లు చేసే నినాదాలు నాలో ఎంతో స్ఫూర్తిని నింపుతాయని, ఆ ధైర్యంతోనే బ్యాట్‌కు పనిజెబుతానని కార్తీక్ పెర్కొన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News