Wednesday, May 1, 2024

ప్రపంచం లోనే అత్యంత పెద్ద వయస్కుడిగా గిన్నిస్ రికార్డు

- Advertisement -
- Advertisement -

ఇంగ్లాండ్‌కు చెందిన జాన్ ఆల్ఫ్రెడ్ టిన్నిస్ వూడ్‌కు దక్కిన గౌరవం

లండన్ : ప్రపంచం లోనే అత్యంత పెద్ద వయస్కుడిగా ఇంగ్లాండ్‌కు చెందిన జాన్ ఆల్ఫ్రెడ్ టిన్నిస్ వూడ్ గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు. ఆయన వయసు 111 సంవత్సరాలు. సౌత్‌పోర్టు లోని ఓ సంరక్షణ కేంద్రంలో ఉంటోన్న ఆయనకు గిన్నిస్ వరల్డ్ రికార్డు బృందం సర్టిఫికెట్ అందజేసింది. అయితే సాధారణ జీవన విధానం, అదృష్టమే తన దీర్ఘాయుష్షు రహస్యమని ఆయన చెప్పడం గమనార్హం. టైటానిక్ నౌక మునిగిన కొన్ని రోజులకే 1912 ఆగస్టు 26న ఆయన జన్మించారు. తన జీవిత కాలంలో రెండు ప్రపంచ యుద్ధాలను చూశారు.

రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ ఆర్మీలో సేవలు అందించారు. అకౌంటెంట్‌గా పదవీ విరమణ చేశారు. “ ఎప్పుడూ ధూమపానం చేయలేదు. మద్యం మాత్రం అరుదుగా తీసుకునే వాడిని. వారానికి ఒకసారి (ప్రతిశుక్రవారం ) చేపలు, చిప్స్ తీసుకోవడం తప్పితే ప్రత్యేకంగా ఎటువంటి డైట్ పాటించలేదు. పూర్తిగా ఇది జీవనశైలితోపాటు నా అదృష్టమే” అని జాన్ ఆల్ఫ్రెడ్ టిన్నిస్ వూడ్ వివరించారు.

ఇప్పటివరకు ఈ ఘనతను సాధించిన వెనిజులాకు చెందిన 114 ఏళ్ల వృద్ధుడు జువాన్ విసెంటే పెరెజ్ ఇటీవలనే మృతి చెందారు. జపాన్‌కు చెందిన మరో వృద్ధుడు గిసాబురో సోనోబే (113) మార్చి 31న చనిపోయారు. దాంతో తాజా రికార్డు జాన్ ఆల్ఫ్రెడ్ పేరు మీద నమోదయ్యింది. ఇక స్పెయిన్‌కు చెందిన మరియా బ్రన్యాస్ మోరేరా (117) ప్రపంచం లోనే అత్యంత వృద్ధ మహిళగా కొనసాగుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News