Tuesday, June 18, 2024

రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో ప్రముఖ దర్శకుడు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో ఇప్పటికే పలువురు పేర్లు తెరపైకి వచ్చాయి. టాలీవుడ్ హీరోయిన్ కుషిత కళ్ళపు చెల్లెలు లిషి గణేష్, టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి పేర్లను పోలీసులు బయటపెట్టారు. రాడిసన్ డ్రగ్స్ కేసులో తొమ్మిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివేకానంద్ నిర్వహించిన పార్టీలో క్రిష్, కేదార్, నిర్భయ్, సందీప్, రఘుచరణ్, నీల్, లిషి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే వివేకానంద్, కేదార్, నిర్భయ్‌లను పోలీసులు అరెస్టు చేయగా మిగిలిన నిందితులు పరారీలో ఉన్నారు. ఈ కేసులో క్రిష్ పేరును ఎ10గా చేర్చారు. వివేకానంద పార్టీలకు క్రిష్ రెగ్యూలర్‌గా వస్తున్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News