Friday, May 3, 2024

రూ.500లకే గ్యాస్ సిలిండర్.. గైడ్ లైన్స్ ఇవే

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ సర్కార్ మంగళవారం మరో రెండు గ్యారంటీలను ప్రారంభించనుంది. హామీ ఇచ్చిన ప్రకారం ఆరు గ్యారంటీలలో ఇప్పటికే రెండు గ్యారంటీలను అమలు చేసిన ప్రభుత్వం.. ఈరోజు సాయంత్రం చేవేళ్లలో నిర్వహించే భారీ బహిరంగ సభలో మరో రెండు గ్యారంటీలు.. మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500 గ్యాస్ సిలిండర్ స్కీమ్‌ తోపాటు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ స్కీమ్ ను ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది. అయితే.. ఈ రెండు పథకాలకు సంబంధించిన గైడ్ లైన్స్ విషయంలో ప్రజల్లో అనేక అపోహాలు ఉన్నాయి. ఈ క్రమంలో రూ.500 గ్యాస్ పథకానికి సంబంధించి గైడ్‌లైన్స్ ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు జీవో జారీ చేసింది.

ఈ పథకానికి గైడ్ లైన్స్ ఇలా ఉన్నాయి..
  • సబ్సిడీ గ్యాస్ సిలిండర్ కోసం మూడు క్రైటీరియాలను ప్రకటించిన సర్కార్.
  • సిలిండర్ సబ్సిడీ కోసం ప్రజాపాలనలో అప్లై చేసిన వారు అర్హులు.
  • ఈ పథకానికి అర్హులుగా తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి చేసింది.
  • మూడు సంవత్సరాల వినియోగాన్ని పరిగణలోకి తీసుకొని.. దాని యావరేజ్ ఆధారంగా సంవత్సరానికి సిలిండర్స్ కేటాయించనుంది
  • వినియోగదారులు మొదట మొత్తం డబ్బు చెల్లించాలి. ఆ తరువాత వినియోగదారుల ఖాతాలోకి తిరిగి సబ్సిడీ అమౌంట్ జమ చేయనుంది.
  • 48 గంటల్లోనే వినియోగదారుల అకౌంట్‌లోకి సబ్సిడీ జమ చేయనున్నారు.
  • గ్యాస్ సబ్సిడీని ప్రభుత్వం నేరుగా ఓఎంసి సంస్థలకు ఇవ్వనుంది. సంస్థల నుంచి డిబిటి ద్వారా వినియోగదారుల ఖాతాల్లో ఆ నగదు జమ కానుంది.
  • జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ పథకాన్ని ప్రభుత్వం మానిటరింగ్ చేయనుంది.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News