Monday, April 29, 2024

డైరెక్టర్ క్రిష్‌కు భారీ ఊరట

- Advertisement -
- Advertisement -

డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్‌కి భారీ ఉరట
నెగెటివ్‌గా తేలిన యూరిన్ టెస్ట్
మన తెలంగాణ/హైదరాబాద్ : రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడికి భారీ ఊరట లభించింది. ఆయన నుంచి సేకరించిన నమూనాల ఫలితాలు నెగెటివ్ వచ్చినట్లు సమాచారం. రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో నిందితుల్లో ఒకడిగా ఉన్న సినీ దర్శకుడు జాగర్లమూడి క్రిష్‌కు భారీ ఊరట లభించింది. ఇటీవల ఈ కేసు విచారణకు ఆయన హాజరైన సంగతి విదితమే. పోలీసులు క్రిష్‌ను విచారించి ఆయన నుంచి నమూనాలు సేకరించి పరీక్షలకు కూడా పంపించారు. తాజాగా ఈ పరీక్షల రిపోర్ట్ వచ్చినట్లు సమాచారం. క్రిష్ యూరిన్ టెస్ట్ నెగెటివ్‌గా తేలింది. అయితే రక్త నమూనాల ఫలితాల కోసం పోలీసులు వెయిట్ చేస్తున్నట్లు సమాచారం. పరారీలో ఉన్నట్లుగా వార్తలు వచ్చిన తర్వాత క్రిష్ శుక్రవారం పోలీసుల ఎదుట హాజరయ్యారు. అలానే శుక్రవారం ఉదయం ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో క్రిష్ పిటిషన్ కూడా దాఖలు చేశారు.

ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన వాదించారు. ఇందులో తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని పిటిషన్‌లో వెల్లడించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం రాడిసన్ డ్రగ్స్ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను కోర్టుకు సమర్పించాలని పోలీ సులను ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. హైదరాబాద్‌లోని రాడిసన్ హోటల్ కేంద్రంగా స్నేహితులతో కలిసి ఇటీవల డ్రగ్స్ పార్టీ ఏర్పాటు చేశారు మంజీరా గ్రూపు డైరెక్టర్ గజ్జల వివేకానంద్. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వివేకానంద్‌తో పాటు మరో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం తొమ్మిది మంది ఈ పార్టీ చేసుకోగా ముగ్గురు మాత్రమే పోలీసులకు చిక్కారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News