Thursday, April 25, 2024

ఏఎస్‌రావునగర్‌లో పదవ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థుల అదృశ్యం

- Advertisement -
- Advertisement -

Tenth grade Students

 

చర్లపల్లి ః కాప్రా సర్కిల్ ఏఎస్‌రావునగర్‌లో పదవ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్ధులు అదృష్యమైన సంఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిదిలో చోటు చేసుకుంది. కుషాయిగూడ సిఐ చంద్రశేఖర్, విద్యార్ధుల తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం కాప్రా సర్కిల్ మీర్‌పేట్ హెచ్‌బికాలనీ డివిజన్ తిరుమల్‌నగర్ కాలనీకి చెందిన వీరభద్రరావు కుమారుడు ఎమ్.చరన్(15), కీసర మండల నాగరం ఎస్వీనగర్‌కు చెందిన కామేశ్వర్‌రావు కుమారుడు వై. సమ్యుల్‌రాజ్(15), కాప్రా సర్కిల్ కాప్రా డివిజన్ శ్రీరాంనగర్ కాలనీకి చెందిన విజయ్‌రాజ్ కుమారుడు హేమంతసాయికృష్ణ(15)లు ఏఎస్‌రావునగర్‌లోని సెంయింట్ ధెరిస్సా పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నారు. సోమవారం వరకు పాఠశాలలో ప్రీఫైనల్ పరీక్షలు పూర్తి అయ్యాయి. మంగళవారం చరన్ కడుపు నొప్పిగా ఉందని ఇంట్లోనే ఉన్నాడు.

సమ్యుల్‌రాజ్, సాయికృష్ణలు పరీక్షలు పూర్తి అయిపోయయని ఇంట్లోనే ఉండి చదువుకుంటామని చెప్పి ఇంట్లోనే ఉండిపోయారు. విద్యార్ధుల తల్లిదండ్రులు కామేశ్వర్‌రావు ప్రభుత్వ ఉద్యోగం చేస్తుండగా మిగత ఇద్దరు ప్రవైట్ ఉద్యోగులు తల్లిదండ్రులు ఉద్యోగానికి వెల్లగానే ఎస్వీనగర్‌కు చెందిన సమ్యేల్‌రాజ్ ఇంట్లోని 5 వేల రూపాయల నగదు, కాప్రా శ్రీరాంనగర్‌కు చెందిన సాయికృష్ణ ఇంట్లో దాచిన ఆరు వేల రూపాయల నగదు తీసుకుని మేము ఇంట్లో నుంచి వెలిపోతునన్నాం మమ్మల్ని వెతక వద్దని ప్రయోజకులం అయిన తరువాత ఇంటికి తిరిగి వస్తాం అని లేటర్ రాసి హెచ్‌కాలనీలోని చరన్ ఇంటికి వచ్చారు.

చరన్ ఇంట్లోని దాచుకున్న బంగారు అభరణం తీసుకుని బట్టలు సర్ధుకుని బయలుదేరారు. రాత్రి ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులకు పిల్లలు కనిపించకపోవడంతో పాఠశాలకు వెల్లి వాకబ్ చేశారు. పాఠశాలకు రాలేదని తెలియడంతో పిల్లలు రాసిన లేటర్ తీసుకుని కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌కు వెల్లి ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని ప్రత్యేక టీంతో విచారిస్తున్నమని త్వరలోనే పిల్లలను పట్టుకుంటామని తెలిపారు.

Disappearance of Tenth grade Students
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News