Sunday, May 19, 2024

రమ్ పమ్ బమ్

- Advertisement -
- Advertisement -

Disco raja

 

మాస్ మహారాజ రవితేజ హీరోగా ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం సినిమాల ఫేం విఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘డిస్కో రాజా’ సినిమాని రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. నభా నటేశ్, పాయల్ రాజ్‌పుత్, తాన్యా హోప్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, సునీల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని మూడో పాటను హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు విఐ ఆనంద్ మాట్లాడుతూ “డిస్కో రాజా సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుంది. రవితేజ క్యారెక్టరైజేషన్ బాగుంటుంది. తమన్ అందించిన పాటలు ఈ మధ్య బాగా పాపులర్ అయ్యాయి.

అలాగే మా సినిమా కోసం అతను మరో సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చాడు. ‘రమ్ పమ్ బమ్…’ పాటకు మంచి స్పందన వస్తోంది”అని అన్నారు. తమన్ మాట్లాడుతూ “ఛాలెంజింగ్‌గా తీసుకొని ‘రమ్ పమ్ బమ్…’ సాంగ్ చేశాను. ఇప్పుడు ఈ పాటను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే నా కష్టాన్ని మర్చిపోయాను. ఈ సినిమాకు మంచి పాటలు చేసే అవకాశం లభించింది”అని చెప్పారు. నభా నటేశ్ మాట్లాడుతూ “రవితేజతో వర్క్ చెయ్యడం మర్చిపోలేని అనుభూతినిచ్చింది. ఈ సినిమాలో నా పాత్ర పేరు నభ. ఈ పాత్ర అందరికి నచ్చుతుంది. ఈ నెల 24న ఈ చిత్రం విడుదలకానుంది”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సునీల్ పాల్గొన్నారు.

Disco raja song release
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News