Thursday, April 18, 2024

ఓటు వేళ బి అలర్ట్

- Advertisement -
- Advertisement -

ktr

 

టిఆర్‌ఎస్ సీనియర్ నేతలతో దావోస్ నుంచి టెలీకాన్ఫరెన్స్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్

పురపోరులో ప్రతి ఓటు విలువైనది
పోలింగ్ కేంద్రాల్లో పార్టీ బూత్ ఏజెంట్ల జాబితాలు సిద్ధం చేసుకోండి
చైర్‌పర్సన్స్ ఎన్నికలకు తగిన ప్రణాళిక రూపొందించుకోండి
పోలింగ్ ప్రక్రియ ముగిసేవరకు విశ్రమించరాదు
ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా చూడాలి
ప్రతిపక్షాల కుట్రలను వమ్ముచేయాలి

హైదరాబాద్ : పోలింగ్ ప్రక్రియ ముగిసేంత వరకు ఎలాంటి నిర్లక్ష్యానికి తావివొద్దని పార్టీ శ్రేణులకు టిఆర్‌ఎస్ కార్యనిర్వాహాక అధ్యక్షుడు, మంత్రి కెటిఆర్ ఆదేశించారు. అనుక్షణం పార్టీ నేతలు అ లర్ట్‌గా ఉండాలని సూచించారు. పోలింగ్ ప్రక్రియలో ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనే విధంగా చూడాలన్నారు. పురపోరులో ప్రతి ఓటు చాలా విలువైనదన్న విషయాన్ని నేతలంతా గుర్తించుకోవాలని సూచించారు. ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు దావోస్‌లో పర్యటిస్తున్న కెటిఆర్ సోమవారం పార్టీ సీనియర్ నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో టిఆర్‌ఎస్ పా ర్టీ బూత్ ఏజెంట్ల జాబితాను తయారు చేయాల్సిందిగా పార్టీ ప్రధాన కార్యదర్శులకు, ము న్సిపల్ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లకు కెటిఆర్ సూచించారు. ఎన్నికల అనంతరం జరిగే చైర్‌పర్సన్ ఎన్నికకు సంబంధించి కూడా అవసరమైన ప్ర ణాళికలను ఇప్పటి నుంచే సిద్ధం చేయాల్సిందిగా కోరారు. పోలింగ్ ప్రక్రియ ముగిసేంత వరకు పార్టీ శ్రేణులు మరింత చురుగ్గా పనిచేయాలన్నారు.

ప్రతిపక్షాలు గెలుస్తామనుకునే ఒకటి, రెండు వార్డుల్లో ఏదైనా అవాంఛనీయ కార్యక్రమాలకు పాల్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో స్థానిక టిఆర్‌ఎస్ పార్టీ క్యాడర్ జాగ్రత్తగా ఉండాలన్నారు. ముఖ్యంగా ప్రజలను మ భ్యపెట్టేందుకు ప్రతిపక్షాలు చేసి ప్రయత్నాలను చెదరిపోయేలా చేయాలని కోరారు. ప్ర స్తుతం తెలంగాణ భవన్ నుంచి కేంద్ర ఎన్నికల సమన్వయ బృందం ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి నుంచి సమాచారం తెప్పించుకుంటుందని, ఆ నివేదికలు టిఆర్‌ఎస్‌కు అత్యంత సా నుకూలంగా ఉన్నాయని కెటిఆర్‌కు, పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డి వివరించారు. ఇప్పటికే పలువురు ఎంఎల్‌ఎలు స్థానిక మంత్రులతో నిరంతరం మాట్లాడుతూ సమన్వయం చేసుకుంటున్నామని తెలిపారు. టిఆర్‌ఎస్‌కు ఘన విజయం ఖాయమని, అయిఏత పార్టీ నేతలు అతి విశ్వాసానికి పోవద్దని సూచించారు.

ఈ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ సాగించిన ప్రచార పర్వంలో ప్రతిపక్షాలకు అందనంత ముందంజలో ఉందన్నారు. ప్రతిపక్షాల దూషణలు, అసత్య ప్రచారాలకు భిన్నంగా పట్టణాలకు ఏం చేస్తామన్నది ఎన్నికల్లో ప్రచారంలో టిఆర్‌ఎస్ చాలా స్పష్టంగా వివరించిదన్నారు. పోలింగ్ కేంద్రాల్లో బూత్ ఏజెంట్ల గుర్తింపు వారి జాబితాను వెంటనే సిద్ధం చేయాలని కెటిఆర్ పేర్కొన్నారు. అభివృద్ధినే తన ఎజెండాగా మార్చుకున్న టిఆర్‌ఎస్ పార్టీకి ప్రతి ఎన్నికల్లో ప్రజల నుంచి లభించిన సానుకూల స్పందన, ఆశీర్వాదం, విజయాల మాదిరే ఈ మున్సిపల్ ఎన్నికల్లోనూ ఘన విజయం లభిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

Do not rest until polling process is over
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News