Thursday, April 25, 2024

ఆగని వీధి కుక్కల దాడులు.. నానక్‌రాంగూడలో యువతిపై కుక్కదాడి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వీధి కుక్కల నియంత్రణకు జీహెచ్‌ఎంసీ చర్యలు తీసుకుంటున్నప్పటికీ కుక్కల దాడి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. నగరంలోని అంబర్ పేటలో రెండ్రోజుల క్రితం నాలుగేళ్ల బాలికపై వీధికుక్కలు దాడి చేసిన విషయం తెలిసందే. తాజాగా జరిగిన ఘటనలో ఓ యువతి తన స్నేహితులతో రోడ్డుపై నిలబడి మాట్లాడుతుండగా వీధికుక్క కరిచింది. హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ ల్యాంకోహిల్స్‌లో ఆదివారం సీసీటీవీ ఫుటేజీలో రికార్డైన ఈ ఘటన సంచలనం సృష్టించింది. సీసీటీవీ ఫుటేజీలో ముగ్గురు యువతులు, ముగ్గురు యువకులు రోడ్డు పక్కన నిలబడి ఉండగా వెనుక నుంచి ఓ కుక్క వారి వద్దకు వచ్చింది. కుక్క పారిపోయే ముందు యువతులలో ఒకరి కాలుపై కరిచింది. బాధితురాలిని వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News