Wednesday, November 6, 2024

15 ఏళ్లు గుడ్డిదానిలా నటించి దొరికిపోయింది

- Advertisement -
- Advertisement -

రోమ్: ఇటలీ ప్రభుత్వం నుంచి వికలాంగురాలి ప్రయోజనాలు పొందడానికి ఓ మహిళ 15 ఏళ్ల పాటు గుడ్డిదానిలా నటించింది. ఆమె ఫోన్ స్క్రాలింగ్ చేయడంతో ఇటలీ ప్రభుత్వం ఆమె భండారం రట్టు చేసింది. 48 ఏళ్ల ఆ మోసగత్తే గుడ్డి దానిగా ప్రభుత్వం నుంచి 2,08,000 యూరోలు(రూ. 1.8 కోట్లు) రాబట్టింది. సామాజిక భద్రత జాతీయ సంస్థ కింద ఆమె 15 ఏళ్ల పాటు వికలాంగురాలిగా ప్రయోజనం పొందింది. అయితే ఇటలీకి చెందిన ప్రధాన చట్ట సంస్థ ‘కారబినీరి’ ఆమె గుట్టును రట్టు చేసింది. గుడ్డి వాళ్లు చేయలేని పనులు ఆమె చేస్తుండడంతో ఆమెను ఆ సంస్థ గుర్తించింది. పూర్తి గుడ్డి వారికి ఇచ్చే ‘వికలాంగుల పింఛను’ను ఆమె తప్పుడు పద్ధతిలో పొందుతోందని ఓ రిటైర్డ్ వ్యక్తి తెలిపారని ‘కారబినీరి’ తన ప్రకటనలో తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News