Saturday, December 7, 2024

ప్రొఫెషనల్ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డు సాధించిన డాక్టర్ నాగరత్న

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/జగిత్యాలః ప్రొఫెషనల్ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డుతో పాటు మోస్ట్ పాపులర్ వైశ్య ఉమెన్ టాప్ 4 అవార్డులను జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన భారతి హస్పిటల్ నిర్వాహకురాలు డాక్టర్ రాచకొండ నాగరత్న సాధించారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్‌లోని ఫిల్మ్ సిటీలో గల జెఆర్‌సి కన్వెన్షన్ హాలులో తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌజింగ్ కార్పోరేషన్ చైర్మన్ కొల్లేటి దామోదర్ గుప్త చేతుల మీదుగా ఈ అవార్డులను డాక్టర్ నాగరత్నకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ ఇమ్మడి శివకుమార్, నిజామాబాద్ ఎంఎల్‌ఎ బిగాల గణేష్, తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పోరేషన్ చైర్మన్ ఉప్పుల శ్రీనివాస్, ఇతర కమిటీ సభ్యులు, భారతి ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News