సృష్టి ఫెర్టిలిటీ కేసులో వైసీపీ నాయకుడి సోదరుడు కీలకం గా ఉన్నట్లు తెలిసింది. సృష్టి కేసులో అరెస్ట్ అయిన ముగ్గురిలో ఒకరు డాక్టర్ వాసుపల్లి రవికుమార్. కేజీహెచ్‌లో అనస్థీషియాలజీ విభాగాధిపతిగా, డిప్యూటీ సూపరింటెండెంట్‌గా రవి కుమార్ పనిచేస్తున్నారు. వైసీపీ హయాంలో రవికుమార్ విశా ఖ కేజిహెచ్ నుంచి నుంచి బదిలీ అయ్యారు. తిరి గి కొద్ది రోజులకే డిప్యూటేషన్‌పై కేజీహెచ్‌కు వచ్చారు. 1988లో ఎంబీబీఎస్‌లో డాక్టర్ నమ్ర త, డాక్టర్ రవి ఇద్దరు ఒకే బ్యాచ్‌లో వైద్య విద్య పూర్తి చేశారు. శిశువిక్రయాల్లో 80 శాతం అరకు, పాడేరు, ఒడిస్సా వంటి ఏజెన్సీ ప్రాంతాల నుంచి తీసుకువచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఏజెన్సీలో నిరుపేద గర్భిణులను గుర్తించి శిశువులను విక్రయించేలా వారితో ముందస్తు ఒప్పందం చేసుకున్నట్లు గోపాలపురం పోలీసుల విచారణ లో వెల్లడైంది. ఏజెన్సీ ప్రాంతాల్లో శిశువులను ఎవరూ అమ్మారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
సృష్టి కేసులో డాక్టర్ రవికుమార్ కీలక పాత్ర
- Advertisement -
- Advertisement -
- Advertisement -