Wednesday, May 1, 2024

రిజిస్ట్రేషన్ నంబర్‌ల ‘ఇబిడ్డింగ్’

- Advertisement -
- Advertisement -
e-Bidding
పైలెట్ ప్రాజెక్టు కింద హైదరాబాద్‌లోని నాలుగు ఆర్‌టిఎ కార్యాలయాల్లో రేపటి నుంచి ప్రారంభం, ఇక వాహనదారులు కోరుకున్న ఫ్యాన్సీ నంబర్ల కేటాయింపు,  ప్రభుత్వానికి భారీగా లభించనున్న ఆదాయం

హైదరాబాద్ : ఇక వాహనదారులు తమకు ఇష్టమైన నంబర్‌ను దక్కించుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోంది. ఇందులో భాగంగా సోమవారం నుంచి వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్‌ల కోసం ప్రత్యేకంగా ఇ…బిడ్డింగ్‌ను అమలు చేస్తోంది. పైలెట్ ప్రాజెక్టు కింద హైదరాబాద్ నగరంలోని నాలుగు ప్రధాన ఆర్‌టిఎ కార్యాలయాలైన ఖైరతాబాద్, సికింద్రాబాద్, మలక్‌పేట్, బండ్ల గూడా రవాణశాఖ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయనునున్నారు. ఇ..బిడ్డింగ్ ద్వారా వాహనాదారులకు కోరుకున్న నంబర్లను ఇవ్వడంతో పాటు ఆర్‌టిఎకు కూడా పెద్దఎత్తున ఆదాయం సమకూరనుంది.

దీనిని దృష్టిలో పెట్టుకుని ఫోర్, టూ వీలర్ వాహనాల కోసం ప్రత్యేకంగా ఈ..బిడ్డింగ్ కార్యక్రమాన్ని అమలు చేయాలని ప్రభుత్వం తలపెట్టింది. వాస్తవానికి వాహనాల ఫ్యాన్సీ నంబర్ల కోసం రాష్ట్రంలో చాలా క్రేజీ ఉంది. ముఖ్యంగా బడా వ్యాపార వేత్తలు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులతో పాటు వివిధ రంగాల్లో పలువురు సెలిబ్రిటిలు తమ వాహనాలకు ప్రత్యేకమైన నంబర్లను దక్కించుకోవడం కోసం వేలం పాటలో భారీ మొత్తంలో చెల్లించి మరీ దక్కించుకుంటారు. అయితే సెలిబ్రిటిలంతా నాలుగు చక్రాల వాహనాల కోసం తమకు ఇష్టమైన నంబర్ల కోసం ఎగబడుతుంటే సామాన్య ప్రజలు టూ వీలర్ వాహనాలకు తమకు ఇష్టమైన నంబర్లను దక్కించుకునేందుకు పెద్దఎత్తున ఆసక్తి చూపుతున్నారు.

ఈ నేపథ్యంలోనే ఆర్‌టిఎ అధికారులు నాలుగు, రెండు చక్రాల వాహనాల కోసం ప్రత్యేకంగా ఫ్యాన్సీ నంబర్ల కోసం ఇ..బిడ్డింగ్ నిర్వహించనున్నారు. కాగా నంబర్ రిజర్వేషన్ చేయాలనుకునే వారు ఇక ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి 1గంట వరకు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ అందించాల్సి ఉంటుంది. అనంతరం మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు బిడ్‌కు సంబంధించి నగదు చెల్లింపు పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. సాయంత్రం 5గంటల తరువాత ఎస్‌ఎంఎస్ ద్వారా ఆ నెంబర్ అలాట్‌మెంట్ (కేటాయించినట్లుగా) మెసేజ్ రూపంలో రవాణా శాఖ నుంచి సదరు వ్యక్తులకు వెలుతుంది. ఇందులో ఏదైనా సమస్య ఉంటే హెల్ప్ లైన్ నెంబర్లను కూడా రవాణా శాఖ అధికారులు ఏర్పాటు చేశారు.

40…23370081, 040-…23370083, 040..-23370084లలో సంబంధిత అధికారులను స్పందించాల్సి ఉంటుంది. ఉదహారణకు 9, 999, 9999 సంఖ్యలలో నంబర్లు కావాలనుకునే వారు ఒకదానికి రూ .50వేలు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే 99, 333, 555, 666, 777,888,2222,3333, 4444, 5555, 6666, 7777, 8888 నంబర్లకు రూ .30 వేలు, 123, 222, 369, 444, 567,786,1111, 1116, 3366, 3456, 4455 నంబర్లకు రూ .20వేలు, 3, 5, 6. 7, 111, 234, 306, 405, 789, 818, 909, 1188,1234, 1314, 1818, 1899, 2277, 2772, 2345, 2727, 2799, 3636, 3663, 3699, 4545, 4554, 4567, 4599, 5678, 6336, 6633, 6789, 7227, 7722, 8118, 8811, 9009, 9099 రూ. 10వేల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అయితే నాలుగు చక్రాల వాహనాలకు, కే సంఖ్యకు ద్విచక్ర వాహనాల కేటాయింపు కోసం దరఖాస్తు ఉన్నప్పుడు నాలుగు చక్రాల దరఖాస్తుదారులకు ప్రాధాన్యతను ఇస్తారు. నిర్దిష్ట రిజిస్ట్రేషన్ నంబర్ కోసం రోజులో ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే ఆర్‌ఆర్‌ఎమ్‌టిఎతో పాటు క్లోజ్డ్ ఎన్వలప్‌లలో టెండర్లు స్వీకరించడం ద్వారా నంబర్లను రిజర్వు చేస్తారని తెలుస్తోంది.

e-Bidding launched for fancy vehicle numbers in Hyd

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News