- Advertisement -
ప్రైవేట్ స్కూళ్లకు స్టాలిన్ పిలుపు
చెన్నై: మాతృభాషలో విద్యను బోధించడానికి విద్యాసంస్థలు ప్రోత్సాహం అందచేయాలని, తమిళ భాషలోనే విద్యాపరమైన పథకాలకు పేర్లు పెట్టాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ పిలుపునిచ్చారు. శుక్రవారం నగర శివార్లలోని పల్లికరనైలో డిఎవి గ్రూపునకు చెందిన ఒక కొత్త పాఠశాలను స్టాలిన్ ప్రారంభిస్తూ ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు మాతృభాషలో విద్యాబోధనకు ప్రాధాన్యమివ్వాలని కోరారు. పాఠశాలలు రూపొందించే పథకాలకు తమిళ భాషను ఉపయోగించి పేర్లు పెట్టాలని ఆయన కోరారు. ప్రతి పౌరుడు మాతృభాషను, దేశాన్ని ప్రేమించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. రెండు ప్రభుత్వ పాఠశాలలకు విద్యాపరమైన చేయూతనివ్వడానికి డిఎవి స్కూలు యాజమాన్యం ముందుకు వచ్చినందుకు ముఖ్యమంత్రి ప్రశంసించారు.
- Advertisement -