Sunday, September 15, 2024

అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అందేలా కృషి చేస్తా: శ్రీనివాస్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  కొత్త పాలసీ రూపకల్పన ద్వారా అర్హులైన జర్నలిస్టులందరికీ త్వరలో ఇళ్ల స్థలాలు వచ్చే విధంగా కృషి చేస్తానని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి  అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్ స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు మామిడి సోమయ్య, కార్యదర్శి బొల్లం శ్రీనివాస్ ఆధ్వర్యంలో పలువురు ప్రతినిధులు మంగళవారం మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డిని కలిసి ఇళ్ల స్థలాల సమస్య, తమ సొసైటీ విషయంపై చర్చించారు.

శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉందని, అయితే ఏ విధంగా ఇవ్వాలన్న విషయంలో కసరత్తు చేయాల్సి ఉందని, అందుకు కొంత సమయం పడుతుందని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News