Sunday, April 14, 2024

మీడియా అకాడమీ చైర్మన్‌గా కె. శ్రీనివాస్ రెడ్డి నియామకం

- Advertisement -
- Advertisement -

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

మనతెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో నామినేటెడ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం మరో అడుగు వేసింది. ఈ మేరకు మీడియా అకాడమీ చైర్మన్‌గా కె.శ్రీనివాస్ రెడ్డిని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవీలో కొనసాగుతారు. ఈ మేరకు స్పెషల్ సెక్రటరీ ఎం. హనుమంత రావు ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. మీడియా అకాడమీ చైర్మన్ కేబినెట్ ర్యాంక్ హోదా పొందుతారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఆయన ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా పని చేశారు. గతంలో విశాలాంధ్ర పత్రికకు, మనతెలంగాణ దినపత్రిక వ్యవస్థాపక ఎడిటర్‌గా కె. శ్రీనివాస్ రెడ్డి వ్యవహారించారు. ప్రస్తుతం ప్రజా పక్షం పత్రికకు కె.శ్రీనివాస్ రెడ్డి ఎడిటర్‌గా ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో అల్లం నారాయణ మీడియా అకాడమీ చైర్మన్‌గా పనిచేశారు.

Srinivas Reddy 2

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News