ఇంటికి టులెట్ బోర్డు పెట్టడం వృద్ధురాలి పాలిట శాపంగా మారింది. బోర్డు చూసిన ఇద్దరు యువకులు ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలి ఇంట్లోకి వచ్చి బెదిరించి మూడు తులాల బంగారు ఆభరణాలు, రూ.6వేల నగదు చోరీ చేసిన సంఘటన వారసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని పార్సిగుట్టలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…పార్సిగుట్టకు చెందిన పారిజాతం(56) ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. వృద్ధురాలు ఉంటున్న పక్క ఇంటికి టులెట్‌బోర్డు పెట్టడంతో అద్దెకు ఇల్లుకావాలని వచ్చిన ఇద్దరు యువకులు ఇంట్లోకి వచ్చి డోర్లు మూసివేశారు. వృద్ధురాలి గొంతుపై కత్తి పెట్టి అరిస్తే చంపివేస్తామని బెదిరించారు. ఆమె ఒంటిపై ఉన్న మూడు తులాల బంగారు ఆభరణాలు, రూ.6,000 నగదును ఎత్తుకుని వెళ్లారు. నిందితులు వెళ్లిపోయిన తర్వాత బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వారసిగూడ పోలీసులు తెలిపారు.
టూ లెట్ బోర్డు పెడితో దోచుకున్నారు
- Advertisement -
- Advertisement -
- Advertisement -