Friday, September 19, 2025

తెలంగాణ మంత్రివర్గ సమావేశానికి ఇసి గ్రీన్ సిగ్నల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ మంత్రివర్గ సమావేశానికి ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చింది. మంత్రివర్గ భేటీకి షరతులతో కూడిన అనుమతి ఇసి ఇచ్చింది. జూన్ 4 లోపు చేయాల్సిన అత్యవసర విషయాలపైనే చర్చించాలని షరతు విధించింది. రైతు రుణమాఫీ, ఉమ్మడి రాజధాని అంశాలపై కేబినెట్‌లో చర్చించవద్దని సూచించింది. ఎన్నికల నిర్వహణలో భాగస్వాములైన అధికారులు భేటీలో పాల్గొనవద్దని ఇసి తెలిపింది. రేవంత్ ప్రభుత్వం శనివారం కేబినెట్ భేటీ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఇసి అనుమతి రాకపోవడంతో వాయిదా వేశారు. ఇసి నుంచి ఎప్పుడు అనుమతి లభిస్తే అప్పుడు కేబినెట్ భేటీ కావాలని నిర్ణయం తీసుకున్నారు. ఇసి అనుమతి ఇవ్వకపోతే ఢిల్లీకి వెళ్లి చీఫ్ ఎలక్షన్ కమిసనర్‌ను కలవాలని నిర్ణయం తీసుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News