Tuesday, April 30, 2024

ఎన్నికల రిటర్నింగ్, నోడల్ అధికారుల నియామకం

- Advertisement -
- Advertisement -

మేడ్చల్ జిల్లా: శానసభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారులను, 16 విభాగాలకు సంబంధించి 22 మంది నోడల్ అధికారులను బుధవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అమోయ్ కుమార్ నియమించారు. మేడ్చల్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారిగా కీసర ఆర్డీవో ఎస్.రాజేష్‌కుమార్, మల్కాజిగిరి రిటర్నింగ్ అధికారిగా సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ ఎన్.రవికిరణ్, కుత్బుల్లాపూర్ రిటర్నింగ్ అధికారిగా ఎస్‌డిసి ఎల్‌ఏ సైదులు పులి, కూకట్‌పల్లికి రిటర్నింగ్ అధికారిగా మల్కాజిగిరి ఆర్డీవో టి.శ్యాం ప్రకాష్, ఉప్పల్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారిగా జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్తా వ్యవహరిస్తారు.

ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు 16 విభాగాలకు నోడల్ అధికారులను కలెక్టర్ అమోయ్‌కుమార్ నియమించారు. మ్యాన్ పవర్ మేనేజ్‌మెంట్ ఐ.విజయకుమారి (డిఈవో), ఎల్.రాంమోహన్‌రావు (ఏవో), శిక్షణ నిర్వహణ దేవసహాయం (జడ్పీ సీఈవో), కేశూరాం ( బిసి సంక్షేమాధికారి), మెటీరియల్ మేనేజ్‌మెంట్ తనూజ (డిఎస్‌వో), రవాణ నిర్వహణ కిషన్ (జిల్లా రవాణ అధికారి), కంప్యూటరైజేషన్, సైబర్ సెక్యూరిటీ, ఐటి సుహాసిని (జిల్లా ఇన్ఫర్మేటిక్ అధికారి), భానుప్రకాష్ రెడ్డి (ఈ జిల్లా మేనేజర్), సీప్ పద్మజారాణి (డిఆర్‌డివో), వి.అనిల్‌కుమార్ (మెప్మా పిడి), లా అండ్ ఆర్డర్ విఎం, సెక్యూరిటీ ప్లాన్ జి.గోవింద్‌కుమార్ (జిల్లా ఎస్సీడివో), ఈవీఎం మేనేజ్‌మెంట్ డి.విజయేందర్‌రెడ్డి (జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ), మోడల్ కోడ్ కండక్టు (ఎంసిసి) కృష్ణారెడ్డి (డబ్లూసిడి,ఎస్), జి.రవీందర్ (జీఎం డిఐసి), వ్యయ పర్యవేక్షణ నర్సింహ్మా (డిటివో), ఆర్.శ్రీనివాస్ (డిసివో), బ్యాలెట్ పేపర్, పోస్టల్ బ్యాలెట్ వంశీమోహన్ (ఎస్డీసి, యూఎల్‌సి), మీడియా కిరణ్‌కుమార్ (డిపిఆర్‌వో), కమ్యూనికేషన్ ప్లాన్ మోహన్‌రావు (సిపివో), ఎలక్టోరల్ రోల్స్ రమణమూర్తి (డిపివో), ఫిర్యాదులు, పరిష్కారం చంద్రావతి (లా ఆఫీసర్), పరిశీలకులు రాజేంద్ర (పౌర సరఫరాల డీఎం) నియమితులయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News