Saturday, July 27, 2024

పర్ణశాల గోదావరిలో పడి వ్యక్తి మృతి..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/దుమ్ముగూడెం: పర్ణశాల పుణ్యక్షేత్రంలో ఆదివారం స్వామివారి తెప్పోత్సవం సందర్భంగా గోదావరి నది మధ్యలో బాణా సంచా కాలుస్తుండగా.. నిప్పు రవ్వ మందుగుండు సామాగ్రిపై పడటంతో చెలరేగిన మంటలతో ప్రమాదవశాత్తు నదిలో పడిపోయిన దేవస్థాన అవుట్సోర్సింగ్ సిబ్బంది కొప్పుల శంకర్ మృతదేహం సొమవారం ఉదయం లభ్యమైంది. దీనికి కారణం దేవస్థాన అధికారుల నిర్లక్షమే కారణం అంటూ మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు, ఎంఆర్‌పిఎస్ నాయకులు అందరూ కలిసి శంకర్ మృతదేహన్ని దేవాలయం ముందర ఉంచి ధర్నా చేశారు. దీంతో ఆలయాన్ని మూసేశారు. ఆ తర్వాత అక్కడికి చేరుకున్న అధికారులు మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి, నష్ట పరిహరంగా 1,15,000 చెల్లించారు. దీంతో పాటుగా మృతుడి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, జాబ్ ఇన్సూరెన్స్ ద్వారా సుమారు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలు, డబుల్ బెడ్ రూమ్ ఇప్పించేటట్లు వారిని ఒప్పించారు.

Employee death after drawed parnasala godavari

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News