Thursday, April 25, 2024

హనుమాన్ జయంతి ర్యాలీకి అందరూ సహకరించాలి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఈ నెల 6వ తేదీన నిర్వహించనున్న హనుమాన్ జయంతి ర్యాలీకి అందరూ సహకరించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అన్నారు. హనుమాన్ జయంతి ర్యాలీ ఏర్పాట్లపై జిహెచ్‌ఎంసి, ఈఎంఆర్‌ఐ, ఆర్ అండ్ బి, ఫైర్, ఆర్‌టిసి, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల అధికారులతో హైదరాబాద్ సిపి సివి ఆనంద్ సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హనుమాన్ జయంతి రోజున సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఊరేగింపు, తిరిగి వచ్చే సమయంలో యువకులు ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దని అన్నారు. పోలీసులు నిర్ధేశించిన మార్గాల్లో ఊరేగింపులు వెళ్లాలని అన్నారు.

సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల నుంచి వచ్చే ఊరేగింపులు కూడా నిబంధనలు పాటించాలని అన్నారు. ఆర్‌టిసి క్రాస్ రోడ్డు వద్ద ఉన్న ఫ్లైఓవర్ వద్ద క్యారేజ్ వేను క్లియర్ చేయాలని ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ జిహెచ్‌ఎంసి అధికారులను కోరారు. ర్యాలీకి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు చెట్లను తొలగించాలని, చెత్తను తొలగిస్తున్నామని అధికారులు తెలిపారు. ఊరేగింపు సజావుగా సాగేందుకు బారికేడింగ్, లైట్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రామమందిర్, పుత్లీబైలి, వైఎంసిఏ, ఆర్‌టిసి ఎక్స్ రోడ్డు, బైబిల్ హౌస్, హనుమాన్ టెంపుల్, తాడ్‌బండ్‌ను కవర్ చేసే 12 కిలో మీటర్ల ఊరేగింపుల మార్గాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు సిపిలు విక్రంసింగ్‌మాన్, సుధీర్‌బాబు, జాయింట్ సిపిలు శ్రీనివాసులు, విశ్వప్రసాద్, సైబరాబాద్, రాచకొండ డిసిపిలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News