Friday, April 19, 2024

వరి ధాన్యం డబ్బుల కోసం రోడ్డెక్కిన రైతులు

- Advertisement -
- Advertisement -

కాటారం : ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో వడ్లు విక్రయించి రెండు నెలలు గడిచినా ఇప్పటికీ బ్యాంకు ఖాతాలలో డబ్బులు జమ కాలేదని రైతులు ఆవేధన వ్యక్తం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని దామెరకుంట గ్రామపంచాయితీ పరిధిలోని లక్ష్మీపూర్, మల్లారం, విలాసాగర్ గ్రామాలలో కాటారం పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో ధాన్యం విక్రయించిన డబ్బులు ఖాతాలలో జమ కాలేదని రైతులు తెలిపారు. శనివారం మండలకేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో 363/సి జాతీయ రహదారిపై బైఠాయించి నినాధాలు చేస్తూ రైతులు నిరసన తెలిపారు. లక్షీపూర్ కొనుగోలు కేంద్రానికి చెందిన సుమారు 80మంది రైతులకు సుమారు రూ.1కోటి 80 లక్షల రూపాయలు జమ చేయాల్సి ఉందని తెలిపారు.

సొసైటీ అధికారులకు ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడంలేదని ఎప్పుడు అడిగినా రేపు, ఎల్లుండి అంటూ నెలల తరబడి మాటలు మారుస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యాసంగి పంటకు పెట్టుబడి కోసం డబ్బులు లేక ఇబ్బందలు ఎదుర్కొంటున్నామని వాపోయారు. కలెక్టర్ స్పందించి ధాన్యం డబ్బులు ఖాతాలలో జమ అయ్యేలా చూడాలని కోరారు. సిఐ రంజిత్‌రావు రైతులతో ఫోన్‌లో మాట్లాడారు. నిర్వాహకులతో మాట్లాడి సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తానని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. మంథని, మహాదేవపూర్, భూపాలపల్లి రోడ్లకు కిలోమీటరు దూరం వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణీకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News