Thursday, April 25, 2024

ఎఫ్‌సిఆర్‌ఐలో తేనెటీగల పెంపకంపై శిక్షణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : అటవీ కళాశాల పరిశోధనా సంస్థ (ఎఫ్‌సిఆర్‌ఐ)లో వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ తేనెటీగల పెంపకంపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జాతీయ తేనెటీగల, తేనె మిషన్ (ఎన్‌బిహెచ్‌ఎం) పథకం కింద జాతీయ తేనెటీగ బోర్డు సిద్దిపేట జిల్లాలోని ములుగు అటవీ కళాశాల పరిశోధనా సంస్థలో ఇంటిగ్రేటెడ్ తేనెటీగల పెంపకం అభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో ఈ నెల 4వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మొదటి విడత శిక్షణ, రెండవ విడత శిక్షణను మార్చి 23 నుంచి 29వ తేదీ వరకు నిర్వహించనున్నారు.

ప్రతి విడతలో 25 మందికి శిక్షణ ఇవ్వనున్నారు.వారం రోజుల పాటు ఇచ్చే శిక్షణలో పాల్గొనే వారందరికీ అల్పాహారం, భోజనం, టీ, రాత్రి భోజనం, వసతి కల్పించనున్నారు. ఈ శిక్షణకు హాజరై వ్యక్తులకు, రైతులకు ప్రయాణ భత్యం అందజేయనున్నారు. మరిన్ని వివరాలకు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ డాక్టర్. వసీమ్‌ని ఫోన్ నెం.7876531614లో సంప్రదించవచ్చునని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News