Monday, April 29, 2024

అన్నదాతలకు షాక్.. హర్యానాలో ఆందోళన చేస్తున్న రైతు మృతి

- Advertisement -
- Advertisement -

డిమాండ్ల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న రైతులకు షాక్ తగిలింది. హర్యానాలోని అంబాలా సమీపంలో శంభు సరిహద్దు వద్ద ఆందోళన చేస్తున్న జ్ఞాన్ సింగ్ అనే రైతు శుక్రవారం ఉదయం కన్నుమూశాడు. గుండెనొప్పి ఉందని చెప్పడంతో అతన్ని వెంటనే రాజ్ పురాలోని సివిల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స  పొందుతూ జ్ఞాన్ సింగ్ మరణించాడు. అతని వయసు 63 ఏళ్లు. జ్ఞాన్ సింగ్ స్వస్థలం పంజాబ్ లోని గురుదాస్ పూర్ జిల్లా అని తెలిసింది.

భారత్ బంద్ పిలుపునకు మిశ్రమ స్పందన

సంయుక్త కిసాన్ మోర్చాలో భాగస్వామిగా ఉన్న భారతీయ కిసాన్ యూనియన్ శుక్రవారం ఇచ్చిన భారత్ బంద్ పిలుపునకు మిశ్రమ స్పందన కనిపిస్తోంది. రైతులు, వ్యాపారులు తమ కార్యకలాపాలను బహిష్కరించి, ఆందోళనలో పాల్గొనాలని రైతు నైత పవన్ ఖటానా పిలుపునిచ్చారు.

భారత్ బంద్ లో భాగంగా పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోని ప్రధాన రహదారుల్లో టోల్ ప్లాజాల వద్ద రైతులు భారీయెత్తున ఆందోళనలో పాల్గొంటున్నారు. ఈ కారణంగా అనేక జాతీయ, ప్రధాన రహదారులపై వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. జలంధర్-అమృత్ సర్ ప్రధాన రహదారిపై కర్తార్ పూర్ వద్ద రైతులు ఆందోళన చేస్తుండటంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. లూధియానాలో బంద్ కారణంగా బస్సులు తిరగలేదు. పాటియాలాలో బంద్ లోపాల్గొన్న రైతులకు పంజాబ్ మహిళా కాంగ్రెస్ వర్కర్లు మద్దతు ప్రకటించారు. హిసార్ లో ఆర్టీసి బస్సుల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. కాగా మార్కెట్లు మాత్రం యధావిధిగా పనిచేశాయి.  లల్రూ పట్టణంలో బంద్ ప్రభావం కనిపించలేదు. పాటియాలాలో బంద్ ప్రభావం అంతగా కనిపించలేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News