Friday, May 3, 2024

బ్యాటింగ్ ప్రారంభించకముందే ఇంగ్లాండ్‌కు ఐదు పరుగులు

- Advertisement -
- Advertisement -

రాజ్‌కోట్: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియాకు పెనాల్టీ పడింది. మూడు టెస్టు మొదటి ఇన్నింగ్స్ రెండో రోజు బ్యాటర్ రవిచంద్రన్ అశ్విన్ పిచ్ మధ్యలో పరుగులు తీయడంతో ప్రత్యర్థి జట్టుకు ఐదు పరుగులు ఆంపైర్లు ప్రకటించారు. దీంతో ఒక్క బంతి ఆడకుండానే ఇంగ్లాండ్ ఐదు పరుగులు వచ్చేశాయి. 102 ఓవర్‌లో ఇంగ్లాండ్ బౌలర్ రెహన్ అహ్మద్ బౌలింగ్‌లో అశ్విన్ బంతిని ఆఫ్ సైడ్ కు తరలించాడు. పరుగు కోస వెళ్తున్నప్పుడు అశ్విన్ ప్రొటెక్టెడ్ ఏరియా రెండు మూడు అడుగులు వెసుకుంటూ వెళ్లిపోయాడు. అశ్విన్ చర్యను ఆంపైర్లు వెంటనే పెనాల్టీ విధించారు. అశ్విన్ ఆంపైర్‌తో చర్చలు జరిపినా ఫలితం లేకుండాపోయింది.

పెనాల్టీ రూల్స్ ప్రకారం ప్రొటెక్టెడ్ ఏరియాలో బ్యాట్స్‌మెన్ రెండు సార్లు అడుగులు వేస్తే ఐదు పరుగులు ప్రత్యర్థి జట్టుకు ఇచ్చేస్తారు. తొలి రోజు టీమిండియా బ్యాట్స్‌మెన్ రవీంద్ర జడేజా ప్రొటెక్టెడ్ ఏరియాలో అడుగులు వేస్తే ఆంపైర్లు హెచ్చరించి వదిలేశారు. అశ్విన్ కూడా పిచ్ మధ్యలో పరుగులు తీయడంతో రెండో తప్పుగా గుర్తించి పెనాల్టీ విధించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News