Thursday, April 25, 2024

కేజ్రీవాల్‌కు తీవ్రమైన పోటీ

- Advertisement -
- Advertisement -

Kejriwal

 

న్యూఢిల్లీ సీటుకు బరిలో 93 మంది
సిఎంకు పోటీగా క్యాబ్ డ్రైవర్లు, ఛక్ దే స్టార్
డిటిసి మాజీ కాంట్రాక్ట్ ఉద్యోగుల పంతం
కేజ్రీవాల్‌ను ఓడించాలనే కుట్ర : ఆప్

న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో న్యూఢిల్లీ స్థానం నుంచి పోటీచేస్తున్న ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ గట్టిపోటీనే ఎదుర్కొనబోతున్నారు. ఈ స్థానానికి మొత్తం 93 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. శుక్రవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత నికరంగా ఎందరు బరిలో ఉండేదీ తేలుతుంది. పోటీ చేస్తున్న వారిలో ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (డిటిసి) మాజీ కాంట్రాక్ట్ ఉద్యోగులు పది మంది, ఐదుగురు క్యాబ్ డ్రైవర్లు, 2011లో భారత అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న నలుగురు సామాజిక కార్యకర్తలు, ‘ఛక్ దే ఇండియా’ సినిమాలో చిన్న పాత్రలో నటించిన జాతీయ స్థాయి హాకీ క్రీడాకారుడు ఒకరు ఉన్నారు. ఫిబ్రవరి 8న జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ వీరందరితో తలపడాల్సి ఉంటుంది. ‘2018లో కేజ్రీవాల్‌పై పోటీచేసిన డిటిసి కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో నేను కూడా ఒకడిని.

కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ సమాన వేతనం ఉండాలని డిమాండ్ చేసినందుకు మమ్మల్ని తీసేశారు. రాజకీయంగా కేజ్రీవాల్‌ను ఓడించేందుకు మాకు ఇదొక్కటే అవకాశం’ అని ఈ ఎన్నికల్లో పోటీచేస్తున్న మనోజ్ శర్మ అనే అభ్యర్థి చెప్పారు. ‘అంజాన్ ఆద్మీ పార్టీ సభ్యుడైన శైలేంద్రసింగ్ షల్లీ జాతీయస్థాయి అథ్లెట్. ‘స్వరాజ్యాన్ని తీసుకొచ్చే సత్తా మాకుంది కాబట్టే పోటీ చేస్తున్నాం. విప్లవ రాజకీయాల్లో అర్వింద్ కేజ్రీవాల్ కన్నా మేమే ముందున్నాం’ అని శైలేంద్ర చెప్పారు. 2009లో ఢిల్లీలోని మందిర్ మార్గ్‌లో రోడ్డుమీద ఒక బస్సుకు నిప్పంటుకున్నప్పుడు అందులో చిక్కుకున్న ప్రయాణీకుల్ని షల్లీ రక్షించారు.

మంగళవారం నామినేషన్ వేసేందుకు వచ్చిన కేజ్రీవాల్‌కు 45 నంబర్ టోకన్ వచ్చింది. ఆయన ఆరుగంటలపాటు రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలో నిరీక్షించాల్సి వచ్చింది. ఆయనకు ముందు 44వ టోకెన్ నంబర్ వ్యక్తి పవన్‌కుమార్ ఒక క్యాబ్ డ్రైవర్. ‘ట్యాక్సీ డ్రైవర్ల సమస్యల్ని ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఆటోరిక్షా రేట్లను సవరించారు కానీ, ట్యాక్సీ డ్రైవర్లకు ఎలాంటి స్కీం లేదు. క్యాబ్ డ్రైవర్లు కూడా ఎంఎల్‌ఎలు అయ్యే రోజు వచ్చింది’ అని పవన్ చెప్పారు.

అందుకే కేజ్రీవాల్ నామినేషన్ ఆలస్యం : ఆప్
న్యూఢిల్లీ సీటుకు ఇంతమంది నామినేషన్లు వేయడం వల్లనే కేజ్రీవాల్ నామినేషన్ దాఖలు చేయడం ఆలస్యమైందని మనీష్ సిసోడియా వంటి సిఎం సహచరులు వ్యాఖ్యానించారు. వీరంతా రోజూవచ్చి టోకన్లు తీసుకుని, నామినేషన్లు వేయకుండా వెళ్లిపోయి, చివరకు కేజ్రీవాల్ నామినేషన్ వేసే రోజుకోసం నిరీక్షించి, ఆ రోజు దాఖలు చేశారని ఆప్ జాతీయ ప్రతినిధి ఆరోపించారు.

Fierce competition for Kejriwal
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News