Tuesday, April 30, 2024

జకోవిచ్, ఒసాకా ముందంజ

- Advertisement -
- Advertisement -

Novak Djokovic

 

మూడో రౌండ్‌లో సెరెనా, ఫెదరర్, బార్టీ గెలుపు, ఆస్ట్రేలియా ఓపెన్

మెల్‌బోర్న్: ప్రతిష్టాత్మకమైన ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా), టాప్ సీడ్ ఆష్లే బార్టీ (ఆస్ట్రేలియా) మూడో రౌండ్‌కు చేరుకున్నారు. మాజీ ఛాంపియన్లు రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్), సెరెనా విలియమ్స్ (అమెరికా)లు కూడా రెండో రౌండ్ పోటీల్లో విజయం సాధించారు. మహిళల సింగిల్స్ విభాగంలో అగ్రశ్రేణి క్రీడాకారిణి బార్టీ 61, 64తో చెక్‌కు చెందిన పొలొనా హార్‌కాగ్‌ను ఓడించింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో బార్టీ పెద్దగా ప్రతిఘటన లేకుండానే విజయాన్ని అందుకుంది. మరోవైపు 8వ సీడ్ సెరెనా బుధవారం జరిగిన రెండో రౌండ్‌లో 62, 63తో స్లోవేనియాకు చెందిన టమారా జిడాన్‌సెక్‌ను చిత్తు చేసింది.

ఆరంభం నుంచే చెలరేగి ఆడిన సెరెనా ఏ దశలోనూ ప్రత్యర్థికి పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. మరో పోటీలో మూడో సీడ్ నవోమి ఒసాకా (జపాన్) విజయం సాధించింది. చైనా క్రీడాకారిణి జెంగ్‌తో జరిగిన రెండో రౌండ్‌లో ఒసాకా 62, 64తో జయభేరి మోగించింది. కాగా, ఏడో సీడ్ పెట్రా క్విటోవా (చెక్) మాత్రం రెండో రౌండ్‌లో కాస్త చెమటోడ్చి విజయం సాధించింది. బడోసా గిబర్ట్ (స్పెయిన్)తో జరిగిన పోరులో క్విటోవా 75, 75తో విజయాన్ని అందుకుంది.

మరోవైపు అమెరికా యువ సంచలనం కొకొ గాఫ్ కూడా మూడో రౌండ్‌కు దూసుకెళ్లింది. హోరాహోరీగా సాగిన పోరులో గాఫ్ 46, 63, 75తో రొమెనియాకు చెందిన సొరానా క్రిస్టియాను ఓడించింది. తొలి సెట్‌లో ఓడిన గాఫ్ తర్వాతి రెండు సెట్లలో గెలిచి ముందంజ వేసింది. పదో సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా), 22వ సీడ్ సక్కారి, 27వ సీడ్ జియాన్ వాంగ్ (చైనా), 18వ సీడ్ లెసి మెర్టెన్స్ (బెల్జియం) తదితరులు కూడా రెండో రౌండ్‌లో విజయం సాధించింది. తమ ప్రత్యర్థులపై అలవోక విజయాలతో మూడో రౌండ్‌కు చేరుకున్నారు.

నొవాక్ అలవోకగా
మరోవైపు పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్, రెండో సీడ్ నొవాక్ జకోవిచ్ అలవోక విజయంతో మూడో రౌండ్‌కు దూసుకెళ్లాడు. రెండో రౌండ్‌లో జకోవిచ్ 61, 64, 62తో జపాన్ ఆటగాడు టసుమా లిటోను ఓడించాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన జకోవిచ్ ఏమాత్రం ప్రతిఘటన లేకుండానే మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. మూడో సీడ్ రోజర్ ఫెదరర్ కూడా మూడో రౌండ్‌లో ప్రవేశించాడు. రెండో రౌండ్‌లో ఫెదరర్ 61, 64, 61తో సెర్బియాకు చెందిన ఫిలిప్‌ను చిత్తు చేశాడు.

దూకుడుగా ఆడిన ఫెదరర్ అలవోకగా మూడు సెట్లు గెలిచి ముందంజ వేశాడు. ఇక, 12వ సీడ్ ఫాబియో ఫొగ్నిని (ఇటలీ) మాత్రం రెండో రౌండ్‌లో అతి కష్టం మీద విజయం సాధించాడు. ఐదు సెట్ల హోరాహోరీ సమరంలో ఫొగ్నిని 76, 63, 36, 46, 76తో జోర్డాన్ థాంసన్ (ఆస్ట్రేలియా)ను ఓడించాడు. హోరాహోరీగా సాగిన పోరులో ఫొగ్నిని, జోర్డాన్ సర్వం ఒడ్డి పోరాడారు. అయితే చివరి వరకు ఆధిపత్యాన్ని కాపాడు కోవడంలో సఫలమైన ఫొగ్నిని ముందంజ వేశాడు. మరో పోటీలో తొమ్మిదో బౌసిస్టా అగట్ (స్పెయిన్) జయకేతనం ఎగుర వేశాడు.

Novak Djokovic 3rd round in Australian open
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News