Thursday, March 28, 2024

బడ్జెట్‌లో గ్రామీణానికే ప్రాధాన్యం

- Advertisement -
- Advertisement -

 Budget

 

ఆర్థిక వ్యవస్థ బలోపేతం.. గ్రామాలను డిజిటల్ ఇండియాకు అనుసంధానం, రైతుల ఆదాయం రెట్టింపు లక్షం

న్యూఢిల్లీ : గ్రామీణ భారత పరివర్తన ప్రధాన కేంద్ర బిందువుగా 2020-21 కేంద్ర బడ్జెట్ ఉంటుందని భావిస్తున్నారు. ఈ మేరకు గ్రామీణ ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని తగు గణనీయమైన కేటాయింపులు, ప్రజోపయుక్త పథకాలకు రూపకల్పన చేస్తున్నట్లు వెల్లడైంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం, గ్రామాలను డిజిటల్ ఇండియాకు అనుసంధానం చేసేందుకు బడ్జెట్‌లో చర్యలకు దిగుతున్నారు. గ్రామాల ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు వీలుగా దాదాపుగా 15 శాతం గ్రామీణ భారతానికి కేటాయింపులు పెంచుతారు. దీని వల్ల గ్రామీణ ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలనే లక్షం పెట్టుకున్నారు. ప్రత్యేకించి చిన్న, మధ్య తరహా రైతులకు మేలు చేసేలా బడ్జెట్‌ను తీర్చిదిద్దాలని బడ్జెట్ సంబంధిత నిపుణులు యోచిస్తున్నట్లు ఈ అంశాలతో పరిచయమున్న వ్యక్తులు తెలిపారు.

ప్రస్తుత ఆర్థిక మందగమనం నుంచి దేశాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు చేయూతను ఇవ్వడమే ముఖ్యమని భావిస్తున్నారు. సరైన డిమాండ్ లేకపోవడంతో దేశ ఆర్థిక స్థితి దిగజారుతోంది. ఉత్పత్తులకు సరైన గిరాకీ లేకపోవడంతో ప్రధాని మోడీ తలపెట్టిన, పదేపదే చెపుతోన్న 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సృష్టించడం అసాధ్యమవుతుందని ఆందోళన చెందుతున్నారు. ఈ కోణంలో వ్యవసాయ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి చర్యలు అత్యవసరమని నిర్ణయించారు. ఈ దిశలోనే ఈ రంగాలకు సరైన కేటాయింపులను బడ్జెట్‌లో కల్పించాలని తలపెట్టారు.

జిడిపి ఆందోళనకరమే
2013 నుంచి ఇప్పటివరకూ ఎప్పుడూ లేని విధంగా దేశ స్థూల దేశీయ ఉత్పత్తి (జిడిపి) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండో ప్రధమార్థంలో అతి కష్టం మీద 4.5 శాతానికి చేరింది. అయినప్పటికీ ఇది 2013 నాటి నుంచి గమనిస్తే అత్యల్పమే. ప్రభుత్వ తొలి ముందస్తు అంచనాల మేరకు దేశ జిడిపి ఈ ఆర్థిక సంవత్సరాంతానికి ఎట్టకేలకు 5 శాతానికి చేరుకుంటుందని స్పష్టం అయింది. ఈ దశలో ఇటీవలి కాలంలో దూరం పెట్టిన గ్రామీణ భారతంపై కేంద్రం తిరిగి మక్కువ ప్రదర్శించేందుకు రంగం సిద్ధం అవుతోంది.

రూ 40,000 కోట్ల అదనపు బడ్జెట్
2020 21 కేంద్ర బడ్జెట్‌లో గ్రామీణభారతానికి అదనంగా రూ 40,000 కోట్ల కేటాయింపులు ఉంటాయని భావిస్తున్నారు. ప్రస్తుత బడ్జెట్‌కాలంతో పోలిస్తే ఈ పెరుగుదల ఉంటుంది. గ్రామీణ భారతంలో రెండుప్రధాన విభాగాలు ఉన్నాయి. వ్యవసాయ విభాగం, రైతుల సంక్షేమం, సహకారానికి ఇప్పటి బడ్జెట్‌లో రూ 1,30,485 కోట్లు కేటాయించారు. ఇక గ్రామీణాభివృద్ధి శాఖకు రూ 1,17,647 కోట్ల వరకూ కేటాయించారు. ఈ మొత్తాలు రానున్న బడ్జెట్‌లో గణనీయంగా పెరుగుతాయి.

బడ్జెట్ అంచనాల (బిఇ) మేరకు ఇప్పటి ఆర్థిక సంవత్సరంలో గ్రామీణాభివృద్ధి శాఖకు మొత్తం నిధుల కేటాయింపును అంతకు ముందటితో 4.66ఠ శాతం పెంచారు. ఇక వ్యవసాయ విభాగానికి వస్తే ఈ పెంపుదల ఏకంగా 179 శాతంగా మారింది. పిఎం కిసాన్ పథకం కింద రూ 75,000 కోట్లను కూడా ఈ విభాగం పరిధిలోకి తేవడంతో ఈ హెచ్చింపు ఏర్పడింది. పిఎం కిసాన్ పథకానికి కేటాయింపులను మినహాయిస్తే ఈ విభాగానికి మంజూరీ అయింది రూ 46,700 కోట్లు.

Rural areas are preferred in Budget
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News