Wednesday, August 6, 2025

డబ్బు కోసం అశ్లీల చిత్రాల్లో నటిస్తుందని ఫిర్యాదు..శ్వేతా మీనన్‌పై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

‘రతినిర్వేదం’ ఫేం నటి, మోడల్, మిస్ ఇండియా 1994 శ్వేతా మీనన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. 51 ఏళ్ల ఈ నటి అశ్లీల చిత్రాల ద్వారా డబ్బు సంపాదించారని ఆరోపిస్తూ… ప్రజా కార్యకర్త మార్టిన్ మేనచేరి ఫిర్యాదు చేయడంతో కొచ్చి సెంట్రల్ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు.

శ్వేతా మీనన్ నటించిన ‘పలేరి మాణిక్యం’, ‘రతినిర్వేదం’, ‘కలిమన్ను’ వంటి మలయాళ చిత్రాలలో అశ్లీల దృశ్యాలు ఉన్నాయని ఆరోపిస్తూ మార్టిన్ మేనచేరి ఫిర్యాదు దాఖలు చేశారు. ఇవి సెన్సార్ బోర్డు ధృవీకరించిన చిత్రాలు. ఇప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఈ చిత్రాలు సోషల్ మీడియా, పోర్న్ సైట్లలో ప్రసారం అవుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, మొదట్లో పోలీసులు ఈ ఫిర్యాదును పట్టించుకోలేదు. దీంతో మార్టిన్ మేనచేరి ఎర్నాకుళంలోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టుకు వెళ్లాడు. ఆ తర్వాత కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు నటి శ్వేతా మీనన్ పై ఎఫ్ఐఆర్‌ నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News