Saturday, April 20, 2024

భూటాన్‌కు తొలిసారి భారతీయ రైల్వేల సరకు రవాణా

- Advertisement -
- Advertisement -

First Indian Railways freight to Bhutan

అలీపూర్‌దువర్(ప.బెంగాల్): భారతీయ రైల్వేలు మొట్టమొదటిసారి భూటాన్‌కు బహుళ మార్గాల ద్వారా సరకు రవాణా వాహనాలను అందచేసినట్లు శనివారం అధికారులు తెలిపారు. భూటాన్ కొనుగోలు చేసిన 75 సరకు రవాణా వాహనాలను చెన్నై నుంచి పశ్చిమ బెంగాల్‌లోని హసిమర రైల్వే స్టేషన్‌కు గూడ్సు రైలు ద్వారా రవాణా చేసినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి వాయువ్య బెంగాల్‌లోని అలీపూర్‌దువర్ జిల్లాలోని హసిమర రైల్వే స్టేషన్‌కు గూడ్సు రైలు చేరుకోగా శనివారం ఉదయం అక్కడ నుంచి రోడ్డు మార్గంలో భూటాన్‌కు తరలించినట్లు వారు చెపపారు. భూటాన్‌కు గూడ్సు రైలు ద్వారా సరకులు రవాణా చేయడం ఇదే మొదటిసారని, ఆ దేశం నుంచి వచ్చే డిమాండు ఆధారంగా భవిష్యత్తులో మరిన్ని సరకులను రవాణా చేస్తామని నార్త్‌ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేస్‌కు చెందిన అలీపూర్‌దువర్ డివిజనల్ రైల్వే మేనేజర్ దిలీప్ కుమార్ సింగ్ తెలిపారు. భూటాన్‌తో వర్తకం చేయడానికి వూహాత్మకంగా కీలక ప్రాంతమైన హసిమర రైల్వే స్టేషన్ వద్ద మౌలిక సౌకర్యాలను అభివృద్ధి చేస్తున్నామని, రైల్వే సైడింగ్ నిర్మాణంతో పాటు కేంద్ర గిడ్డంగి సంస్థతో కలసి ఒక గిడ్డంగిని నిర్మించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు. అన్ని రకాల వస్తువులను రవాణా చేయాలని భావిస్తున్నామని, అందులో ఇది తొలి అడుగని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News