Friday, March 29, 2024

భారతీయ రైల్వే చరిత్రలో తొలి సౌర బుకింగ్ కార్యాలయం

- Advertisement -
- Advertisement -

First Solar Booking Office

 

హైదరాబాద్: భారతీయ రైల్వే చరిత్రలో దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన బుకింగ్ కేంద్రం పూర్తి స్థాయిలో సౌరఫలకాలతో నిర్మించారు. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా దక్షిణ మధ్య రైల్వే జోన్ నూతన ఆవిష్కరణలో భాగంగా భారతీయ రైల్వే చరిత్రలో ఘన కీర్తి సాధించింది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర మంత్రిత్వ శాఖల నుండి దక్షిణ మధ్య రైల్వే జోన్ పలు మార్లు ఇంధన పొదుపు అవార్డులను కూడా సాధించారు. నూతన బుకింగ్ కార్యాలయం పైకప్పును సాధారణ ఆర్‌సిసికి బదులుగా సంపూర్ణంగా సౌరఫలకాల ద్వారా ఏర్పాటు చేశారు. ఈ నిర్మాణానికి కేవలం రూ.13,750 వ్యయం చేశామని గురువారం విడుదల చేసిన ప్రకటనలో రైల్వే అధికారులు వివరించారు.

First Solar Booking Office at Kamareddy railway station
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News