Wednesday, August 6, 2025

ఉత్తరకాశీలో మళ్లీ ఆకస్మిక వరదలు

- Advertisement -
- Advertisement -

ఉత్తరకాశీలోని ధరాలి ను ముంచెత్తిన జల ప్రళయం నుంచి ఇప్పటివరకూ 250 మంది ప్రజలను రక్షించారు. అక్కడ మేఘాలు ముంచెత్తడంతో భారీ వరదలు సంభవించి హఠాత్ గా డజన్ల కొద్దీ ఇళ్లను ముంచెత్తాయి. ఇప్పటికీ ఐదు మృతదేహాలను వెలికితీశారు. తొమ్మిది మంది ఆర్మీ జవాన్ల జాడ ఇప్పటికీ తెలియలేదు. భారీ ఎత్తున ఒక పక్క సహాయ కార్యక్రమాలు చేపడుతుంటే, మరో పక్క జాడ తెలియని వారికోసం గాలిస్తున్నారు. సైన్యం, ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు, పెద్దఎత్తున సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. రోడ్లను క్లియర్ చేసేందుకు భారీ యంత్రాలను హెలికాప్టర్ల ద్వారా రప్పిస్తున్నారు.ఉత్తరకాశీ జిల్లాలో భారీ వర్షంతోపాటు ఉధృతంగా వచ్చిన వరదతో కూడిన జలప్రళయం వల్ల కొండచరియలు, మళ్లి పెళ్లలు ముంచెత్తడంతో ధరాలి గ్రామంలో విధ్వంసం జరిగింది.హోటళ్లు, ఇళ్లు, హోమ్ స్టేలతో కూడిన పర్యాటక ప్రాంతాన్ని బురద కమ్మేసింది.

ఐదుగురు మరణించగా 50 మందికి పైగా గల్లంతయ్యారు. ఇప్పటికీ వర్షం, మేఘావృతం కావడంతో సహాయ కార్యక్రమాలకు అంతరాయం కలుగుతోంది. కొండలతో ఉన్న ఆప్రాంతంలో ఖీర్ గంగా నది, ఈ మంచుతో కప్పబడిన ప్రాంతంలో నిటారుగా ఎత్తులో ఉద్భవించింది. ఈ ప్రాంతంలో అనేక హిమనదీయ చెరువులు ఉన్నాయి. భారీ వర్షం , మంచు కరగడంతో పాటు భారీ వర్షం వల్ల దరాలీ గ్రామాన్ని మళ్లి పెళ్లలతో కప్పపడిపోయింది.ధరాలి నుంచి 135 మందిని, సమీప ప్రాంతాల నుంచి 100 మందిని, హర్షిల్ నుంచి మరో 35 మందిని రక్షించారు. హర్షల్ లో ఆర్మీ జవాన్ల శిబిరాన్ని ఆకస్మిక వరద ముంచెత్తింది. దీంతో 11 మంది జవాన్లు గల్లంతయ్యారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మాట్లాడుతూ, జలప్రళయంలో చిక్కుకున్న వారందరినీ రక్షించేందుకు సాధ్యమైన చర్యలుతీసుకుంటున్నట్లు తెలిపారు. బురద, కొండచరియలు మట్టితో మూసుకుపోయిన రోడ్లు, దెబ్బతిన్న వంతెనల వల్ల సహాయ కార్యక్రమాలకు అంతరాయం కలుగుతోందని పేర్కొన్నారు.
.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News