Saturday, July 27, 2024

ఫుడ్ ప్రాసెసింగ్ హబ్ గా మారుస్తాం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Food processing hub in Telangana

రాజన్నసిరిసిల్ల: ఆహార శుద్ధి పరిశ్రమలకు నర్మాలను హబ్‌గా మారుస్తామని పురపాలక, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. నర్మాలలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌కు భూమి పూజ కార్యక్రమం చేపట్టారు. భూమిపూజ కార్యక్రమంలో మంత్రి కెటిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నర్మాలలో మెగా ఫుడ్ పార్క్‌కు ఏర్పాటుకు 260 ఎకరాలు సేకరించామన్నారు. ఇది కేవలం మొదటి అడుగు మాత్రమేనని, యువతకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతోనే ఈప్రాజెక్ట్ చేస్తున్నామన్నారు. నాలుగు మెట్రిక్ టన్నుల ఉన్న సామర్థ్యాన్ని 20 మెట్రిక్ టన్నులు ఉన్న సామర్థ్యానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకెళ్లిందన్నారు. సిఎం కెసిఆర్ నాయకత్వంలో అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇవ్వడం లేదని, నీటి తీరువా, భూమి శిస్తు లేకుండా చేశామని స్పష్టం చేశారు. రైతు చనిపోతే ఐదు లక్షల రూపాయల బీమా సదుపాయం కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని దాశరథి కృష్ణామాచార్యులు అన్నారని, తెలంగాణలో కోటిన్నర ఎకరాల మాగాణి చేసిన ఘనత కెసిఆర్‌కు దక్కుతుందని ప్రశంసించారు. దేశానికి తెలంగాణ అన్నం పెడుతోందని ఫుడ్ కార్పొరేషన్ ఆప్ ఇండియా చెబుతుందని, పది నుంచి పన్నెండు రాష్ట్రాలకు మనం వరి ధాన్యం అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎంఎల్‌సి నారదాసు లక్ష్మణ్ రావు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News