Friday, April 26, 2024

త్వరలోనే ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ

- Advertisement -
- Advertisement -

Food processing policy

 

రైతులు ఆర్థికంగా స్థిరపడాలన్నదే లక్షం
కాళేశ్వరం ప్రాజెక్టును త్రీ గోర్జెస్ డ్యాం కన్నా వేగంగా పూర్తి చేశారు
త్రిసూర్ సదస్సులో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి

హైదరాబాద్ : రైతులు ఆర్థికంగా స్థిరపడాలన్నదే తమ లక్ష్యమని, అదే స్ఫూర్తితో పనిచేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. కేరళ లోని త్రిసూరులో వ్యవసాయంలో రైతుల పంటలను లాభదాయకం చేయడం ఎలా అనే అంతర్జాతీయ సదస్సుకు హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. వినియోగం కన్నా ఎక్కువగా వస్తున్న ఉత్పత్తులను యాజమాన్యం చేయాల్సి ఉందన్నారు.- రైతులకు పొలం వద్దనే మద్దతుధర కల్పించే ప్రయత్నాలు చేయాలని, – దానిమూలంగా రైతుల ఆదాయం పెంచడంతో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు ప్రోత్సాహం అందించినట్లు అవుతుందన్నారు. రాష్ట్ర పారిశ్రామిక పాలసీలలో ఉన్న 14 అంశాలలో ఆహారశుద్ది పరిశ్రమలకు ప్రాధా న్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

ఆహారశుద్ది పరిశ్రమల అధ్యయనం కోసం వివిధ శాఖల అధికారులతో కమిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు. త్వరలోనే నూతన పాలసీని తీసుకువచ్చేందుకు కసరత్తు జరుగుతుందన్నారు. -ఈ పాలసీతో ఆహారశుద్ది యూనిట్లను నెలకొల్పే పరిశ్రమలను ఏర్పాటుచేసే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు తోడ్పాటు అందిస్తుందన్నారు. రాష్ట్రంలోని గ్రామీణ నియోజకవర్గాలు అన్నింటిలో ఈ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు సంపూర్ణంగా అధ్యయనం చేసినట్లు తెలిపారు. – అభివృద్ధిలో వివక్ష మూలంగా తెలంగాణ ఉద్యమం పుట్టిందని, ఇప్పుడు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నామన్నారు. – కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని సిఎం కెసిఆర్ చైనా త్రీ గోర్జెస్ డ్యాం కన్నా వేగంతో పూర్తి చేశారన్నారు. -రైతుబంధు, రైతు బీమా పథకం అమలుతో ప్రభుత్వం ఆసరాగా నిలుస్తుందన్నారు.

జిల్లాల్లో ఆహార శుద్ధి పరిశ్రమలు ఇలా..
వివిధ పంటలకు సంబంధించి ఆహారశుద్ది పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు నిజామాబాద్ జిల్లా నందిపేట, వేల్పూరులలో పసుపు, పాలు, అపరాలు, సత్తుపల్లి, జనగాం జిల్లా కల్లెంలో పండ్లు, కూరగాయలు, సిద్దిపేట, సిద్దిపేట జిల్లా బండతిమ్మాపూర్‌లలో రైస్ మిల్లు, వ్యవసాయ ఉత్పత్తులు, కరీంనగర్, జగిత్యాల జిల్లాలలో మామిడి, మొక్కజొన్న, సిరిసిల్లలో పశువుల ఆహారం, జహీరాబాద్ మాంసం, పాల ఉత్పత్తులు, రంగారెడ్డి జిల్లా చందనవెల్లిలో వినియోగదారుల ఉత్పత్తులు యాదాద్రి – భువనగిరి చౌటుప్పల్ లో ఆహార ఉత్పత్తులు, మెదక్ జిల్లా చేగుంట వంటనూనెలు, మహబూబాబాద్ జిల్లా కురవి, వరంగల్ జిల్లా నర్సంపేటలో మిరప ఉత్పత్తులకు అనుకూలమని గుర్తించినట్లు చెప్పారు. – ఈ కార్యక్రమంలో కేరళ వ్యవసాయ శాఖ మంత్రి వి.ఎస్ సునీల్ కుమార్, కేరళ చీఫ్ విప్ కె.రాజన్ తదితరులు పాల్గొన్నారు.

పుల్లయి వరి సాగు క్షేత్రం పరిశీలన..
సదస్సు అనంతరం మంత్రి నిరంజన్‌రెడ్డి త్రిసూరు సమీపంలోని పుల్లయి వరి సాగు క్షేత్రాన్ని మంత్రి నిరంజన్‌రెడ్డి సందర్శించారు. అక్కడ సాగు తీరు, వ్యవసాయ యాంత్రీకరణ, దిగుబడి, నీటి తీరువా, కూలీల పరిస్థితిపై రైతులతో ఆరా తీశారు. కూలీల కొరత తీవ్రత, మగ కూలీ వెయ్యిపెట్టినా దొరకడం లేదని రైతులు వివరించారు. దీన్ని అధిగమించేందుకే దాదాపు 800 మంది రైతులు 900 ఎకరాల్లో సంఘటితమై సహకార సంఘం ఏర్పాటు చేసుకుని సాగుచేస్తున్నారు.- ఎకరానికి 30 నుంచి 35 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది.- సహకార వ్యవసాయం బాగుందని, ఈ తరహా ప్రయోగం తెలంగాణ లో చేయాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు.

Food processing policy soon
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News