Thursday, October 10, 2024

ఫ్యూయల్ ట్యాంకర్, ట్రక్ ఢీ..48 మంది సజీవ దహనం

- Advertisement -
- Advertisement -

నైజీరియాలో ఆదివాంర ఒక ఫ్యుయెల్ ట్యాంకర్ ఒక ట్రక్‌ను ఢీకొన్నప్పుడు విస్ఫోటం సంభవించగా కనీసం 48 మంది దుర్మరణం చెందారని దేశ అత్యవసర స్పందన సంస్థ వెల్లడించింది. ఉత్తర మధ్య నైగర్ రాష్ట్రంలోని అగేయి ప్రాంతంలో ఫ్యుయెల్ ట్యాంకర్ పశువులను కూడా రవాణా చేస్తున్నదని, వాటిలో కనీసం 50 సజీవ దహనం అయ్యాయని నైగర్ రాష్ట్ర అత్యవసర నిర్వహణ సంస్థ డైరెక్టర్ జనరల్ అబ్దుల్లాహి బాబాఅరబ్ తెలియజేశారు.

ప్రమాద స్థలంలో అన్వేషణ, రక్షణ కార్యక్రమాలు సాగుతున్నాయని బాబాఅరబ్ తెలిపారు. ప్రాథమికంగా 30 మృతదేహాలు కనిపించాయని బాబాఅరబ్ తెలిపారు. కానీ ఆ తరువాత విడుదలైన ఒక ప్రకటన ప్రకారం, రెండు వాహనాలు ఢీకొన్నప్పుడు సజీవ దహనమైన మరి 18 మంది మృతదేహాలు కనిపించాయి. మృతులను సామూహికంగా ఖననం చేశారని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News