Saturday, April 27, 2024

ఉమ్మడి మెదక్‌లో బిఆర్‌ఎస్‌దేపై చేయి!

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సంగారెడ్డి బ్యూరో : ఉమ్మడి మెదక్ జి ల్లాలో బిఆర్‌ఎస్ పైచేయి సాధించింది. గజ్వేల్‌లో కెసిఆర్, సిద్దిపేటలో హరీశ్‌రావు, దుబ్బాకలో ప్రభాకర్‌రెడ్డి, పటాన్‌చెరులో మహిపాల్‌రెడ్డి, జహీరాబాద్‌లో మాణిక్‌రావు, నర్సాపూర్‌లో మాజీ మంత్రి సునితా లకా్ష్మరెడ్డి, సంగారెడ్డిలో చింత ప్రభాకర్ ఘన విజయం సాధించా రు. ఆదివారం జరిగిన ఓట్ల లెక్కింపులో హైద్రాబాద్, రంగారెడ్డి తర్వాత ఉమ్మడి మెదక్ జిల్లాలోనే బిఆర్‌ఎస్ అభ్యర్థులు అధిక సంఖ్యలో విజయం సాధించారు. దీం తో జిల్లావ్యాప్తంగా పార్టీ శ్రేణులు సంబురాలు జరిపా యి. ఇక విపక్ష కాంగ్రెస్‌కు గతంలో సంగారెడ్డిలో పార్టీ ఎమ్మెల్యేజగ్గారెడ్డి మాత్రమే ఉండగా.. ఈసారి అనూహ్యంగా ఆయన ఓటమి పాలయ్యారు. ఆంథోల్‌లో సి ట్టింగ్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, మెదక్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి, నారాయణఖేడ్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ఓటమి పాలయ్యారు.

ఆంథోల్‌లో మాజీ డి ప్యూటీ సిఎం రాజనర్సింహ, మెదక్‌లో యువనేత మై నంపల్లి రోహిత్,నారాయణఖేడ్‌లో సంజీవరెడ్డి గెలుపొందారు. ఆవిధంగా కాంగ్రెస్‌కు మూడు అసెంబ్లీ స్థా నాల్లో మాత్రమే విజయం దక్కింది. సంగారెడ్డి,జహీరాబాద్, న ర్సాపూర్‌లో బిఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్య విజయం దో బూచులాడింది. చివరకు బిఆర్‌ఎస్ అభ్యర్థులే గెలుపొందారు. నారాయణఖేడ్‌లో అనూహ్యంగా బిఆర్‌ఎస్ ఓ టమి పాలు కావడం పార్టీ శ్రేణులను నివ్వెర పరిచింది. ఆంథోల్‌లో రాజనర్సింహ మొదటి నుంచి గెలుపుపై ధీమాతో ఉన్నారు. కాకుంటే బిఆర్‌ఎస్ స్థాయిలో పోల్‌మేనేజ్‌మెంట్‌ను ఆయన చేయలేకపోవడంతో..బిఆర్‌ఎస్ కు కొంత ఆశ ఉన్నది. కానీ, చివరకు రాజనర్సింహ కే విజయం దక్కింది. వరుసగా రెండు సార్లు ఓడిపోయినప్పటికీ ఈ సారి గెలవడంతో ఆయన అభిమానుల్లో హ ర్షం వ్యక్తమవుతోంది.సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు క్రాంతికిరణ్ విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలి తం లేకపోయింది. రాజనర్సింహ విజయంలో ఆయన కూతురు త్రిశాల కీలక పాత్ర పోషించింది.గత సంవత్స ర కాలంగా ఆమె నియోజకవర్గంలో పర్యటించారు.

ప్ర చారంలో కూడా తనదైనశైలిలో వ్యవహరించారు. మహిళలను ఆకట్టుకున్నారు. ప్రధాన ప్రచారకురాలిగా ఆమె ముందుండి నడిపించారు. ఇక నారాయణఖేడ్‌లో కాం గ్రెస్ గ్రూపుల కలయిక పార్టీ కేడర్‌లో విశ్వాసాన్ని పెం చింది. మాజీ ఎంపి సురేష్‌షెట్కార్‌కు పారీ టికెట్ దక్కినప్పటికీ… స్థానిక పరిస్థితులు కారణంగా సంజీవరెడ్డికి బి ఫామ్ ఇచ్చారు. దీంతో సంజీవరెడ్డి రంగంలోకి కొద్ది కేవ లం 15 రోజుల్లోనే విజయం సాధించారు.ఇక మెదక్‌లో బిఆర్‌ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్‌రెడ్డిపై ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్‌ను గెలిపించింది. సామాజిక సేవా కార్యక్రమాలను చేయడం ద్వారా తన తండ్రి మైనంపల్లి హన్మంతరావుకు ఉన్న పేరు కూడా రో హిత్ విజయానికి తోడయింది. మంత్రి హరీష్‌రావు పర్యవేక్షణలో జహీరాబాద్, సంగారెడ్డి,నర్సాపూర్ అసెంబ్లీ ని యోజక వర్గాల్లో బిఆర్‌ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించింది. ఈ నియోజకవర్గాల గెలుపు క్రెడిట్ హరీశ్ రావుకే దక్కుతుంది.!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News