Thursday, February 29, 2024

గ్రేటర్ అభివృద్ధితోనే బిఆర్‌ఎస్‌కు గెలుపు బాట

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిటీ బ్యూరో: గ్రేటర్‌లో బిఆర్‌ఎస్ ప్ర భుత్వం చేపట్టిన అభివృద్ధ్ది పథకాలే ఆపార్టీ అభ్యర్థులను గెలుపుబాట పట్టించాయి. గ్రేటర్ ప్రజలు పూర్తిగా బిఆర్‌ఎస్‌కు పట్టం కట్టడంతో వారి విజయం నల్లేరు మీద నడకలా సాగింది. గ్రేటర్ వ్యాప్తంగా 24 నియోజకవర్గాలుండగా 16 స్థానాలను బిఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. అభ్యర్థులంతా భారీ మెజార్టీతో విజయం సాధించారు. బిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారం కోల్పోయినప్పటికీ గ్రేటర్‌లో మాత్రం ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ చెప్పుకోదగ్గ స్థానాలు దక్కాయి. బిఆర్‌ఎస్ పార్టీ 119 స్థానాల్లో పోటీ చేయగా 39 స్థానాల్లో గెలుపొందింది. ఈ 39 స్థానాల్లో 16స్థానాలు గ్రేటర్ పరిధిలోని కావడం గమన్హారం.

అభివృద్ధ్దిలో దూసుకుపోయిన గ్రేటర్ హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర అవిర్భావం తర్వాత గడిచిన తొమ్మిదిన్నర ఏళ్లలో అభివృద్ధి పరంగా గ్రేటర్ హైదరాబాద్ దూసుకుపోయింది. మంత్రి కెటిఆర్ ప్రత్యేక చొరవతో అనేక అభవృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడమే కాకుండా వాటిని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ఆ పార్టీ అభ్యర్థుల విజయానికి దోహదం చేసింది. నగరంలో నెలకొన్న పద్మ వ్యూహం లాంటి ట్రాఫిక్ చిక్కుల నుంచి నగరవాసులకు ఉపశమనం కల్పించేందుకు వేలాది కోట్ల రూపాయాలతో ప్లైఓవర్లు, అండర్‌పాస్ మార్గాలు, లింక్ రోడ్లను అభివృద్ధి చేయడంతో నగరంలో 60 శాతానికి పైగా ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గడమే కాకుండా పార్కుల అభివృద్ధి పర్చడం ద్వారా ప్రజలకు అహ్లాదకరమై వాతవరణం కల్పించడంలో ప్రభుత్వం విజయం సాధించింది.

అదేవిధంగా గ్రేటర్ వాసులకు 20 వేల లీటర్ల వరకు మంచినీటి ఉచితంగా అందించడం, నగరంలో నెలకొన్న ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారంగా నాలాల అభివృద్ది కార్యక్రమం, పేదల కోసం ప్రత్యేకం గా మల్టీఫర్‌పస్ ఫంక్షన్ హాళ్ల నిర్మాణం, స్మశాన వాటిక అభివృద్ధి, నిరుపేదలకు ఉచితంగా డబుల బెడ్‌రూం ఇళ్ల పంపిణీ, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేయడం, వాటి ద్వారా నగరంలోని అన్ని వర్గాల ప్రజలకు లబ్ధ్ది చేకూరడం కూడా బిఆర్‌ఎస్‌కు ఈ ఎన్నికల్లో కలిసి వచ్చింది.

ఫలించిన బిఆర్‌ఎస్ అభ్యర్థుల కష్టం
గ్రేటర్‌లో బిఆర్‌ఎస్ అభ్యర్థుల కష్టం ఫలిచింది. తమ గెలుపు కో సం వారంతా రాత్రి పగళ్లు కష్టపడ్డారు.
దాదాపుగా అందరూ సిట్టింగ్ ఎమ్మెల్యేలే కావడం, దీంతో వారికి నియోజకవర్గల్లో పూర్తి పట్టు ఉండడంతో విజయానికి మార్గం సుగమమైంది. అంతేకాకుండా గత తొమ్మిదిన్నర ఏళ్లలో జరిగిన అభివృద్ధ్దిలో వారి పాత్ర కూడ ఉండడంతో గ్రేటర్‌లు వారిని పూర్తిగా నమ్మి ఓటు వేశారు. దీంతో 2018లో గెలుపొందిన అన్ని స్థానాలను ఆ పార్టీ అభ్యర్థులు తిరిగి దక్కించుకున్నారు.

సెటిలర్లు బిఆర్‌ఎస్‌కు సంపూర్ణ మద్దతు
నగరంలోని సెటిలర్లు ఎప్పటీ మాదిరిగా బిఆర్‌ఎస్‌ను పక్షాన నిలిచారు. దీంతో గ్రేటర్ పరిధిలోని అన్ని నియోజకరవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. ఎల్‌బినగర్ నియోజకవర్గానికి సంబంధించి గత జిహెచ్‌ఎంసి ఎన్నికల బిఆర్‌ఎస్‌ను ఆదరించిన సెటిలర్లు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బిఆర్‌ఎస్ వైపు మొగ్గు చూపడంతో ఆ పార్టీ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి సునాయసంగా విజయం సాధించారు. అదేవిధంగా శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బూల్లాపూర్, రాజేంద్రనగర్, మహేశ్వరం, సనత్ నగర్, జూబ్లీహిల్స్ తదితర నియోజవర్గాల్లో సెటిలర్లు బిఆర్‌ఎస్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. దీంతో ఆయా నియోజక వర్గాల్లో బిఆర్‌ఎస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో ఘన విజయం సొంతం చేసుకున్నారు. మొత్తంమీద రాష్ట్రంలో కాంగ్రెస్ గాలీ వీచినా గ్రేటర్‌లో మాత్రం అందుకు విరుద్ధంగా ఫలితాలు వచ్చాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News