Sunday, October 6, 2024

లక్ష్మీగణపతి గరిక ప్రియుడు

- Advertisement -
- Advertisement -

అష్ట గణపతుల్లో లక్ష్మీ గణపతిని సకల సంపదలూ ఇచ్చే స్వామిగా కొలుస్తారు. ఇక ఆ స్వామికి తొండం కుడివైపునకు ఉంటే ఇంకా శుభం అంటారు. అందుకే అసీఫాబాద్‌లో కొలువై ఉన్న లక్ష్మీగణపతి స్వామి అంటే స్థానికులకు ఎంతో నమ్మకం. తెలంగాణలోని అదిలాబాద్ జిల్లా, అసీఫాబాద్ పట్టణ బ్రహ్మణవాడలో ఉన్న లక్ష్మీగణపతి ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. నిజాం కాలంలో తమ బానిస నంకెళ్లు తెంచమని కోరుకుని స్థానికులు ఇక్కడ లక్ష్మీగణపతి స్వామివారికి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేశారట. అప్పట్నించీ ఆ చట్టు పక్కల గ్రామాల భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా ప్రసిద్ధికెక్కాడు ఈ స్వామి.

మొదట్లో మట్టి గోడలూ, రేకులపైకప్పుతో నిర్మించిన ఈ ఆలయ శిథిలావస్థకు చేరడంతో 1972లో పురర్నిర్మించాలని భావించారు స్థానికులు. దాంతో ఆ నాటి ప్రముఖ స్వతంత్య్ర సమరయోధుడు దండ నాయకుల రాంచందర్‌రావు పైకాజీ ఆలయ నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చును తానే భరిస్తానని ముందుకొచ్చినట్టు చెబుతారు. మూలవిరాట్ వినాయకుడి విగ్రహంతోపాటు ఈ లక్ష్మీగణపతి ఆలయంలో శివ పంచాయతన విగ్రహాలైన గణపతి, శివుడు, పార్వతి, వెంకటేశ్వరుడు లక్ష్మి, సూర్యుడు, నాగదేవత విగ్రహాలు కూడా ఉంటాయి. ఈ వినాయకుడికి ప్రతి రోజూ 21 దూర్వాలను (గరిక) సమర్పిస్తూ 21రోజులు గరికతో పూజలు చేస్తే కార్యసిద్ధి కలుగుతుందనీ సకల సంపదలూ లభిస్తాయని భక్తుల నమ్మకం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News