Tuesday, October 15, 2024

విఘ్నేశ్వరుని మంగళ హారతులు

- Advertisement -
- Advertisement -

శ్రీ శంభుతనయునకు సిద్దిగణనాథునకు వాసిగల దేవతా వంద్యునకును –
ఆనరస విద్యలకు ఆదిగురువైనట్టి భూసురోత్తమ లోకపూజ్యూనకును-
జయ మంగళం !!
నేరేడు మారేడు నెలవంక మామిడి దుర్వార చెంగల్వ ఉత్తరేణు వేరువేరుగా దెచ్చి
వేద్కతోబూజింతు పర్వమున దేవగణపతికి నిపుడు జయ మంగళం !!
సుస్థిరముగా భాద్రపద శుద్ధచవితియందు పొసగ సజ్జనులచే పూజ గొనుచు శశి
జూడరాదన్న టేకొంటి నొక వ్రతము పర్వమున దేవగణపతికి నిపుడు
జయ మంగళం !!
ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ళమీదికి దండు పంపు! కమ్మని
నెయ్యుయును కడయ ముద్దపప్పును బొజ్జవిరుగగ దినుచు పొరలుకొనుచు
జయ మంగళం !!
వెండి పళ్ళెములోన వేయివేయి ముత్యాలు కొండలుగ నీలములు కలయబోసి
మెండగను హారమూ మెడనిండ వేసుకొని దండిగా నీకిత్తు ధవళారతి
జయ మంగళం !!
పువ్వులను నిను గొల్తు గందాల నిను గొల్తు కస్తూరిని ! ఎప్పుడు నిను గొల్తు
ఏకచిత్తమ్మున పర్వమున దేవగణపతి నిపుడు జయ మంగళం !!
ఏకదంతంబున ఎల్లగజవదనంబు బాగైన తొండంబు వలపు కదపు !
జోకయిన మూషికము పరుగునెక్కాడుచు భవ్యుడగు దేవగణపతికి నిపుడు
జయ మంగళం !!
మంగళము మార్తాండతేజునకు మంగళము సర్వజ్ఞవందితునకు |
మంగళము ముల్లోక మహితసంచారునకు మంగళము దేవగణపతికి నిపుడు
జయ మంగళం నిత్య శుభమంగళం !!
ఉద్వాసన మంత్రము :
యజ్ఞేన యజ్ఞమయజంత దేవాస్తాని ధర్మాణి ప్రధమాన్యాసన్ !
తేహనాకంమహిమానస్సచంతే యత్ర పూర్వేసాధ్యాస్సంతిదేవా: !!
సర్వేజనాః సుఖినోభవంతు
-సోమేశ్వర శర్మ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News