Sunday, October 6, 2024

శమీపత్రం నుంచి జాజీ పత్రం పూజయామి

- Advertisement -
- Advertisement -

1.శమీపత్రం పూజయామి-జమ్మి
జమ్మి చెట్టులో అగ్నిగుణం ఉందని యజుర్వేదం వర్ణిస్తోంది. అందుకే జమ్మి చె ట్టు నుండి తీసిన ముక్కతో అగ్నిని రాజేసి హోమాదులను నిర్వహిస్తారు. పాండవులు అరణ్యవాసానికి వె ళ్తూ తమ ఆయుధాలను ఈ చెట్టుపైనే ఉంచారు. ఈ ఆకు కఫాన్ని హరిస్తుంది. మూలవ్యాధి, కుష్ఠువ్యాధుల నివారణకు పనికొస్తుంది.

2.బిల్వ పత్రం పూజయామి-మారేడు
శివపూజ కోసమే మా రేడు పుట్టిందంటారు. లక్ష్మీదేవి ఈ చెట్టుపై కొలువుంటుంది. అందు కే లక్ష్మీ అష్టోత్తరం బిల్వనిలయాయై నమోనమః అంటూ వర్ణిస్తోంది. శతపథ బ్రాహ్మణంలో దీని ప్రస్తావనలున్నట్లు తెలుస్తోంది. దీని పండ్ల గుజ్జు జిగురులా పనిచేస్తుంది.

3.అర్జున పత్రం పూజయామి-మద్ది
యజ్ఞాలలో ఉపయోగించే సంబరాలను పవిత్రం చేసేందుకు మద్దిని వినియోగిస్తారు. ముఖ్యంగా పితృసంబంధమైన కార్యాలలో మద్ది వినియోగం ఎక్కువగా ఉంటుది.

4.అశ్వత్థ పత్రం పూజయామి-రావి
దీనికే పిప్పల అని మరోపేరు. సంతానం లేనివారు రావిచెట్టు, వేపచెట్టును కలిపి అశ్వత్థ కల్యాణం చేసి సంతానం పొందుతారు. అగ్నిదేవు డు ఈ వృక్షంలో నివసించాడని వేదం చెబుతోం ది. బృహస్పతి గ్రహహో మానికి రావి సమిధలను ప్రత్యేకంగా వాడతారు. జ్వరం, నోటిపూత నివారణకు ఈ ఆకును వాడతారు.

5.బదరీపత్రం పూజయామి-రేగు
మైత్రాయణి సంహితలో బదరీవృక్షానికి సంబంధించిన ప్రస్తావన కనబడుతుంది. యుద్ధంలో పో రాడుతున్న ఇంద్రుడికి శక్తి కలగడానికి దేవతలకు వైద్యులైన అశ్వినీదేవతలు రేగుపళ్లు తినిపించారు. దీన్ని జీర్ణకోశ వ్యాధులకు వాడతారు. రుచిని పుట్టిస్తుంది. బలాన్నిస్తుంది. దీని ఆకుల నురగ రాస్తే కాళ్లమంటలు, అరిచేతుల మంటలు తగ్గుతాయి.

6.చూత పత్రం పూజయామి-మామిడి

ఇంట్లో ఏ శుభకార్యమైనా మామిడాకు తోరణాలు కట్టుకుంటాం. కొ న్ని ప్రాంతాలలో మొదటగా పూతకు వచ్చే మా మిడి చెట్లకు కల్యాణం చేస్తారు. తద్వారా సమృద్ధిగా ఫలసాయం అందుతుందని భావిస్తారు. పచ్చి మామిడి ఆకు నలిపి వాసన చూస్తే శ్వాసకోశ ఇబ్బం దులు తొలగిపోతాయి.

7.దాడిమీపత్రం పూజయామి-దానిమ్మ

లలితా సహస్రనామల్లో అ మ్మవారికి దాడిమీ కుసుమప్రభ అనే నామం కనిపిస్తుంది. చండీహోమాలలో దానిమ్మ పళ్లను, పూలను ఆహుతిగా సమర్పిస్తారు. నోటిపూత వచ్చినప్పుడు దానిమ్మ చిగుళ్లను నమిలితే తగ్గుతుంది.

8.దేవదారు పత్రం పూజయామి
హిమాలయాలలో పెరి గే మొక్క ఇది. అతి సుమనోహరంగా ఎత్తు గా పెరుగుతాయి. సహజత్వం ఉట్టిపడేలా ఉం డేందుకు కొన్ని రకాల దేవతల విగ్రహాలను ఈ కలపతో తయారు చేస్తారు. దీనిని సరళ అనే పేరుతోనూ వ్యవహరిస్తారు. దీని ఆకులతో కాచిన తైలం కళ్లకు చలువ చేస్తుంది.

9.బృహతీ పత్రం పూజయామి-వాకుడు
ఇది గడ్డి జాతి మొక్క. బృహ తీ పత్రం చూర్ణం దురదల కు, నొప్పులకు పనిచేస్తుం ది. దీని కషాయంతో నోటిని శుభ్ర పరచుకుంటే నోటి దుర్వాసన తొలగిపోతుంది. రక్తశుద్ధి చేయగల శక్తి బృహతీ పత్రానికి ఉంది.

10. దూర్వాయుగ్మ పత్రం పూజయామి-గరిక
మానవుని పాపాలను తొలగించి పవిత్రులను చేసే అనేక రకాలైన సాధనాలన్నింటిలోకి గరికపూజ శ్రేష్ఠమైనది. వందలు వేల సంఖ్య మూలంతో అనేక వేర్ల తో గరిక వర్ధిల్లుతోంది అని మహానారాయణోపనిషత్తు దూర్వాయుగ్మం విశిష్ఠతను గొప్పగా వర్ణించింది.

 

11. కరవీరపత్రం పూజయామి-గన్నేరు
దేవీ దేవతలందరినీ గన్నేరు పూలతో పూజించవచ్చు. ముఖ్యంగా గౌరీ, లక్ష్మీ, సరస్వతులకు గన్నేరుపూలతో పూజ చేస్తే సత్ఫలితాలు కలుగుతాయి. స్తోత్ర సాహిత్యంలో దీని వర్ణన కనిపిస్తుం ది. ఇది శరీరంలో కంతులు ఏర్పడ కుండా నివారిస్తుంది.

12.మరువక పత్రం పూజయామి
సువాసనలు చిందే చిన్నిమొక్క మరువం. వివిధ రంగుల పూలతో దండ గుచ్చి ధరించడానికి మ రువాన్ని వాడతారు. అన్ని ఇతర దేవతల పుష్పమాలల్లోనూ మరువం తప్పనిసరిగా ఉంటుంది. విష్ణు పరమైన దేవతల అలంకారాలలో దీనిని విశేషంగా ఉపయోగిస్తారు.

13.మాచీపత్రం పూజయామి-దవనం
చల్లని ప్రదేశాలైన కశ్మీ ర్, నేపాల్ వంటి చోట్ల విరివిగా లభిస్తుంది. సువాసన కలిగిన వీటి ఆకుల నుండి నూనెను తీస్తారు. సుగంధద్రవ్యాలలో ఉపయోగిస్తారు.

14.తులసీ పత్రం పూజయామి
తులసి కోట అందరి ఇళ్లలో ఉంటుంది. ఉదయాన్నే తులసిని దర్శించుకుంటే పాపాలు నశిస్తాయి. తులసీ దళాలను ప్రత్యేకించి విష్ణుపూజలో వినియోగిస్తా రు. వినాయక పూజలో మాత్రం చవితినాడు మాత్రమే తులసికి స్థానం ఉంటుంది. మిగతారోజుల్లో తులసితో వినాయకుడిని పూజించరు.

15.అర్కపత్రం పూజయామి-జిల్లేడు
వేదాలలో విశిష్ఠమైన గుర్తిం పు ఉన్నదీ అర్కపత్రం. మహాగ్నిచయనం అనే క్రతువును చేసేటప్పుడు ఈ ఆకులనే పాత్రలుగా ఉపయోగించి మేకపాలతో వేదికను అభిషేకిస్తారు. జిల్లేడు ఆకులతో విస్తరి కుట్టి అందులో భోజ నం చేస్తే శరీరంలోని సూ క్ష్మక్రిములు నశిస్తాయని ఆ యుర్వేదం చెబుతుంది.

16. అపామార్గపత్రం పూజయామి-ఉత్తరేణి
సముచి అనే రాక్షసుణ్ణి అపమార్గం పట్టించి, ఇంద్రుణ్ణి కాపాడింది ఉత్తరేణి. నవగ్రహాలలో బుధు డి ప్రీతికోసం ఉత్తరేణి పుల్లలతో హోమం చేస్తారు. దీని ప్రస్తావన కూడా మన కు వేదంలో కనబడుతుం ది. ఉత్తరేణి వేరు దంత ధావనకు మంచిది.

17.దత్తూర పత్రం పూజయామి- ఉమ్మెత్త
శివుడికి తెల్లపూలంటే ప్రీతి. అందులోనూ తెల్లనివర్ణంలో పూచే ఉమ్మెత్త పూలతో పూజి స్తే అత్యంత సంతృప్తి చెందుతాడు. నలుపు ఉమ్మెత్తలు కూడా ఉంటాయి.

18.గండకీ పత్రం పూజయామి-లతాదూర్వా
అరణ్యాలలో మాత్రమే అరుదుగా లభిస్తుంది. గండకీ వృక్షపు ఆకు దీర్ఘ వ్యాధులకు కూడా దివ్యౌషధంగా పనిచేస్తుంది.

19.విష్ణు క్రాంత పత్రం పూజయామి
ఆకులు, బెరడు మొదలైన వాటిని కషాయంగా చేసుకొని తాగితే అద్భుతమైన జ్ఞాపకశక్తి సొంతమవుతుంది. ఈ ఆకు జ్వరానికి మంచి మందుగా పనిచేస్తుంది.

20.సింధు వారపత్రం పూజయామి-వావిలి
ఒంటి నొప్పులను తగ్గిం చి శరీరానికి హాయిని కలిగిస్తుంది. పొలాల్లో గట్లవెంబడి పెరుగుతుం ది. దీని కషాయం జ్వర దోషాలను తొలగిస్తుంది.

21. జాజీ పత్రం పూజయామి
సువాసనలు వెదజల్లే జాజిపూలను శివారాధనలో విరివిగా వాడతా రు. దీని నుండి త యా రు చేసే నూనె శరీరానికి చల్లదనాన్నిస్తుంది. సుగ ంధం మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. కా మెర్లను పోగొడుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News