మన తెలంగాణ/ఎల్బీనగర్: వనస్థలిపురం పో లీస్ స్టేషన్ పరిధి హుడా సాయినగర్ కాలనీలో త న్వి అనే ఒక ప్రైవేటు ఆసుపత్రిలో దారుణం చో టుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో చిన్నారి ప్రా ణం బలైంది. పోలీసులు, స్థానికులు వివరాల ప్ర కారం.. యాదాద్రి భువనగిరి జిల్లా, పోచంపల్లి మండలం,భీమనపల్లికి చెందిన ధ్యానమైన శేఖర్, జ్యోతి దంపతుల కూతురు నిహారిక (10) కిరా ణా దుకాణానికి వెళుతున్న క్రమంలో అనుకోకుం డా ఆమె గొంతులో 10 రూపాయల నాణెం ఇరుక్కుంది. తల్లిదండ్రులు ఈనెల 18న వనస్థలిపురంలోని తన్వి ఆసుపత్రిలోకి తీసుకువచ్చారు. ఆస్పత్రి వైద్యులు సర్జరీ చేసి బాలిక గొంతు నుంచి రూ.10 నాణెం తీసి 19వ తేదీ ఇంటికి పంపించారు. మరుసటిరోజు బాలిక ఆరోగ్యం పరిస్థితి విషమించి, అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో తల్లిదండ్రులు మళ్లీ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అప్పటికే బాలిక మృతి చెందిందని వైద్యులు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు వైద్యుల నిర్లక్ష్యంతోనే తన కూతురు మృతి చెందిందని ఆందోళన చేపట్టారు. వైద్యులపై చట్టబరమైన చర్య లు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వైద్యం వికటించి బాలిక మృతి
- Advertisement -
- Advertisement -
- Advertisement -