Monday, April 29, 2024

ఇరాన్ క్షిపణీ దాడి ఎఫెక్ట్.. మరింత పెరిగిన పసిడి ధర

- Advertisement -
- Advertisement -

Gold

 

న్యూఢిల్లీ: ఇరాన్, అమెరికా దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో ఒక్కసారిగా బంగారం ధరలు ఆకాశాన్ని తాకాయి. బుధవారం ఇరాక్‌లోని అమెరికన్ సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు జరిపిన నేపథ్యంలో బంగారం ధరలు మరింత పెరిగాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో బంగారం ధర రూ. 42,000 దాటింది. గ్లోబల్ మార్కెట్లలో మరో రెండు శాతం పెరుగుదలను నమోదు చేసిన పసుపు లోహం రేటు ఏడు సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకుంది. ముంబయిలో 10 గ్రాముల బంగారం రూ.42,400 ధరకు చేరుకోగా.. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ. 42,350కి చేరుకుంది.

Gold Price Crosses Rs 42,000 Mark

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News