Saturday, December 7, 2024

బంగారం ధర ఆల్‌టైమ్ హై !

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటును పావు పాయింట్లు పెంచడంతో భారతీయ నగరాల్లో బంగారం ధరలు సర్వకాల అత్యధిక రికార్డు స్థాయికి చేరాయి. నేడు హైదరాబాద్‌లో బంగారం ధరలు 1.1 శాతానికిపైగా పెరిగాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో 22 క్యారెట్ బంగారం ధర రూ. 53600గా, 24 క్యారెట్ బంగారం ధర రూ. 58470గా ఉంది. ఇక ముంబైలో 53600, 58470గా, చెన్నైలో 54750, 59730గా, న్యూఢిల్లీలో 53750, 58610గా, కోల్‌కతాలో 53600, 58470గా ఉంది. బంగారం ధరలు ఇంతలా పెరగడానికి దేశీయ, అంతర్జాతీయ కారణాలున్నాయి.

హైదరాబాద్‌లో, ఇతర నగరాలలో బంగారం రేట్లు పెరుగుతుండడం వల్ల బంగారంపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని వర్తకులు డిమాండ్ చేస్తున్నారు. అలాచేస్తే అమ్మకాలకు ఊతం లభించడమేకాక, స్మగ్లింగ్‌ను కూడా అరికట్టవచ్చని వారంటున్నారు. బంగారం దిగుమతిపై ఇప్పటికీ 15 శాతం సుంకం కొనసాగుతోంది. మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం 10 గ్రాముల బంగారం త్వరలో రూ. 60000కు చేరుకుంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News