Sunday, April 28, 2024

లోకోపైలట్లు లేకుండానే 70 కిమీ. …

- Advertisement -
- Advertisement -

జమ్మూ-కశ్మీర్ నుంచి పంజాబ్ వరకు పరుగులు

చివరకు ఇసుక బస్తాలు, కర్రల సాయంతో నిలిపివేత

అదృష్టవశాత్తు తప్పిన ప్రమాదాలు

చండీగఢ్: పట్టాలు ఉన్నాయి. తనకు అడ్డెముంది అనుకున్నట్లుగా ఓ గూడ్స్ రైలు డ్రైవర్ లేకుండానే 84 కిలోమీటర్లు ప్రయాణించింది. 53 వ్యాగన్లతో కూడిన గూడ్స్ జమ్మూకశ్మీర్ నుంచి బయలుదేరింది. పంజాబ్‌లోని ఓ గ్రామం వరకూ డ్రైవర్ లోకో పైలట్లు లేకుండానే కదలింది. దాదాపు వంద కిలోమీటర్ల వేగంతో వెళ్లిందని వెల్లడైంది. ముకేరియా వరకూ డ్రైవర్ లేకుండా ఈ గూడ్స్ ప్రయాణం సాగింది. కతూవా స్టేషన్ నుంచి బయలుదేరిన రైలుకు మార్గమధ్యంలో హేండ్ బ్రేక్ వేయకుండానే లోకోపైలట్లు సిబ్బంది మార్పు కోసం కిందికి దిగారు.

బ్రెక్ వేయడం మరిచారు. దీనితో ఈ మార్గంలో వాలు ఉండటంతో నెమ్మదిగా కదిలిన గూడ్స్ క్రమేపీ వేగం పుంజుకుంది. దీనిని ఆలస్యంగా గమనించిన రైల్వే అధికారులు దీనిని పట్టుకుందుకు నానావిధాలుగా కష్టపడి ఎట్టకేలకు రాళ్లు రప్పలు చెక్కలు అడ్డంపెట్టి దీనిని పంజాబ్‌లోని ముకురిన్ వద్ద అడ్డగించి తమ స్వాధీనంలోకి తీసుకుని ఊపిరిపీల్చుకున్నారు. డ్రైవర్‌లేకుండానే సాగిన ఈ రైలు పయనం ఫోటోలు వీడియోలుగా వైరల్ అయ్యాయి. ఘటనపై రైల్వేశాఖ అంతర్గత దర్యాప్తు చేపట్టింది. లోకో పైలట్ల వివరణ తీసుకుంది. ఆదివారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో సరకుల బండి కదలికల ఘట్టం చోటుచేసుకుంది.

పఠాన్‌కోట్ వైపు పూర్తిగా పల్లంగా ఉండటంతో రైలు పరుగులు తీసి ఉంటుందని భావిస్తున్నారు. రైల్వే నిర్మాణపనులకు ఈ గూడ్స్ రైలు అవసరం అయిన చిప్ రాళ్ల సామాగ్రితో బయలుదేరింది. మార్గమధ్యంలో ఎటువంటి ప్రమాదం జరగలేదు. గూడ్స్ రైలును రైల్వే సిబ్బంది, పంజాబ్‌లోని రైలు ప్రయాణికులు అనేక చిట్కాలతో ఎట్టకేలకు క్షేమంగా నిలిపివేయగలిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News